Friday, December 9, 2022
Friday, December 9, 2022

చీరాల కామాక్షిలో కిడ్నీ జబ్బులకు పూర్తి సంరక్షణ

ఆరోగ్య శ్రీ ద్వారా ఆపరేషన్‌ లేకుండా లేజర్‌ ఆల్టర్‌ సౌండ్‌ వీవెస్‌ ద్వారా కిడ్నీలో రాళ్లు తొలగించబడును

విశాలాంధ్ర`చీరాల : కిడ్నీ జబ్బులకు సంబంధించిన డయాలసిస్‌, కిడ్నీలో రాళ్లకు, కిడ్నీ సంబంధిత ఆపరేషన్లకు డాక్టర్‌ వైయస్సార్‌ ఆరోగ్యశ్రీ ద్వారా శ్రీ కామాక్షి కేర్‌ హాస్పిటల్‌ నందు వైద్య సేవలు ఆదివారం ఉదయం పదకొండు గంటలకు చీరాల శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి, చీరాల వైఎస్‌ఆర్సిపి ఇన్చార్జ్‌ కరణం వెంకటేష్‌ బాబు చేతుల మీదగా ప్రారంభించబడుతుందని శ్రీ కామాక్షి కేర్‌ హాస్పిటల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ తాడివలస దేవరాజు తెలియజేశారు. శ్రీ కామాక్షి కేర్‌ హాస్పిటల్‌ ఆవరణలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో దేవరాజు మాట్లాడుతూ చీరాలలోనే డయాలసిస్‌, అన్నిరకాల ఎముకల ఆపరేషన్లు,జనరల్‌, లాప్రోస్కోపి ఆపరేషన్లు, కిడ్నీలో రాళ్ల ఆపరేషన్లు, చెవి, ముక్కు, గొంతు ఆపరేషన్లు, వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ ద్వారా అందిస్తున్నామని తెలియజేశారు. చిన్నఎముకలు విరిగినా, పెద్ద ఎముక విరిగినా అన్ని ఎముకల ఆపరేషన్లో కూడా ఆరోగ్యశ్రీ వైద్య సేవలో ఉచితంగా అందిస్తామని, పేషెంట్‌ చేరిన 24 గంటల్లోపే ఆపరేషన్‌ సంబంధించిన పర్మిషన్ను ట్రస్ట్‌ అందజేస్తుందని తెలిపారు. డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ వైద్య సేవలను బాపట్ల, పర్చూరు,చీరాల నియోజకవర్గ ప్రజలందరు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనరల్‌ ఫిజీషియన్‌ డాక్టర్‌ రాజీవ్‌ రెడ్డి, ఎముకల స్పెషలిస్ట్‌ డాక్టర్‌ ముఖేష్‌ రెడ్డి ,జనరల్‌ సర్జన్‌ డాక్టర్‌ లక్ష్మీనారాయణ, హాస్పటల్‌ జీయం తాడివలస సురేష్‌,ఆరోగ్యమిత్ర అనిల్‌, బోయాజ్‌,శ్రీ కామాక్షి కేర్‌ హాస్పిటల్‌ వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img