Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

సీపీఐ జిల్లా మహాసభలను విజయవంతం చేయండి

సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి దేవండ్ల శ్రీనివాస్‌

విశాలాంధ్ర-యర్రగొండపాలెం : ఈ నెల 22వ తేదీన కనిగిరిలో జరిగే సీపీఐ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి దేవండ్ల శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం యర్రగొండపాలెంలోని సీపీఐ కార్యాలయంలో నియోజకవర్గ కౌన్సిల్‌ సమావేశం నియోజకవర్గ సహాయ కార్యదర్శి జి.గురునాధం అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ మాట్లాడుతూ పశ్చిమ ప్రాంత ఆశాజ్యోతి అయిన పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు పూర్తయితే 4 లక్షల 35 వేల ఎకరాలకు సాగునీరు, 20 లక్షల మందికి త్రాగునీరు అందుతాయన్నారు. కోటకట్ల చెరువుకు నిధులు మంజూరు చేసి పూర్తి చేయాలన్నారు. తీగలేరు కాలువ(టి5) చిన్న కండ్లేరు వరకు పొడిగించి నిధులు కేటాయించి త్వరగా పూర్తి చేయాలన్నారు. ముటుకుల సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకును మరమ్మతులు చేయించి, మండలంలోని 44 గ్రామాలకు త్రాగునీరు అందించాలన్నారు. పుల్లలచెరువు మండలంలో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీని ఏర్పాటు చేయాలన్నారు. సీపీఐ సీనియర్‌ నాయకులు టీసీఎచ్‌ చెన్నయ్య మాట్లాడుతూ త్రిపురాంతకం చెరువును రిజర్వాయర్‌ గా మార్చాలన్నారు. త్రిపురాంతకం మండలంలోని కాల్వ చివరి భూములకు సాగునీరు అందించాలన్నారు. వెల్లంపల్లి దగ్గర గుండ్లకమ్మ పై నిర్మించిన బ్రిడ్జికి అప్రోచ్‌ రోడ్డు నిర్మించాలన్నారు. దోర్నాల మండలం తిమ్మాపురం అసైన్డ్‌ భూములను అక్రమ ఆన్లైన్లో తొలగించి, ఆ భూములు పేదలకు పంచాలన్నారు. ఈ సమావేశంలో సీపీఐ నియోజకవర్గ సహాయ కార్యదర్శి కె.గురవయ్య, సీపీఐ మండల కార్యదర్శులు బాణాల రామయ్య, మానేపల్లి విశ్వరూపాచారి, పి.నాగయ్య, డిఎచ్‌ పిఎస్‌ జిల్లా అధ్యక్షుడు పి.తిరుమలయ్య, ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి దాసరి మల్లికార్జున, ఏఐటీయూసీ మండల సహాయ కార్యదర్శి ఎస్కే రహమాన్‌, పంచవృత్తుల సంఘం జిల్లా నాయకులు వై.వెంకట శివయ్య, మహిళా సంఘం నాయకురాలు ఎస్కే. నూర్జహాన్‌, ప్రజానాట్యమండలి నియోజకవర్గ కన్వీనర్‌ గుంటూరు శ్రీను, ఏఐటీయూసీ నియోజకవర్గ గౌరవ అధ్యక్షుడు ఆవుల యోగయ్య, సీపీఐ నాయకులు ఎనిబెర తిరుమలయ్య, పి.ఆంజనేయులు, నక్కా తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img