Friday, April 19, 2024
Friday, April 19, 2024

కామ్రేడ్ నల్లూరి గోవిందమ్మ మృతి

విశాలాంధ్ర -మద్దిపాడు: కమ్యూనిస్టులు వీర మరణం చెందినా కూడా వారి ఆశయాలు ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటాయి. .మండల పరిధిలోని పెదకొత్తపల్లి పంచాయితీ నరసాయపాలెం గ్రామానికి చెందిన సిపిఐమహిళా నాయకురాలు ,మహిళా సమైక్య సభ్యురాలు కామ్రేడ్ నల్లూరి అంజయ్య సతీమణి కామ్రేడ్ గోవిందమ్మ(84) వృద్ధాప్యంతో స్వర్గస్తులైనారు.ఆమె భౌతిక కాయాన్ని సందర్శన నిమిత్తం హైద్రాబాద్ లోని గృహము నందు ఏర్పాటు చేయడమైనది. సిపిఐ పార్టీ నిర్మాణంలోనూ కామ్రెడ్ సుబ్బారావు తొ పాటుగా కామ్రెడ్ నల్లూరి అంజయ్య దంపతులు పార్టీ పోరాటాలపై ఉద్యమాలలోనూ గ్రామస్థాయి కమిటీల నిర్మాణంలో ముందు ఉండి నడిచేవారు. .కామ్రెడ్ నల్లూరి అంజయ్య- గోవిందమ్మ దంపతులకు ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు.సంతానము కూడా పూర్తి స్థాయిలోనే పార్టీ విధి విధానాలకు లోబడి పార్టీ నిర్మాణంలోనూ పార్టీ ఆదేశాల మేరకు అనేక సంఘాలలో పని చేయడం జరిగిందని ప్రస్తుతానికి ఇప్పుడు కూడా వారికుటుంబ సభ్యులుభారత కమ్యూనిస్టు పార్టీకి విధేయులై పనిచేస్తున్నారు. పెదకొత్తపల్లి త్రాగునీటి సమస్యపై ఆనాటి భారత కమ్యూనిస్టు పార్టీ నిర్వహించిన గ్రామస్థాయి ఉద్యమాల పోరాటాలలో కామ్రెడ్ నల్లూరి అంజయ్య గోవిందమ్మ ప్రత్యక్షంగా పరోక్షంగా కీలక పాత్ర పోషించారు..రైతులు కూలీలకు తక్కువ గింజలు కొలిసే విధానంలో ఆనాటి భూస్వాములకు ఎదురు తిరిగి మాట్లాడగలిగి నట్టు వంటి మహిళా నాయకురాలు కామ్రెడ్ గోవిందమ్మ.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img