Friday, May 3, 2024
Friday, May 3, 2024

ఎమ్మెల్యే ఓటమి కోరుతూ పోలేరమ్మకు మొక్కులు

ఎమ్మెల్యే టీజేఆర్ వ్యవహార శైలిపై మూడో రోజు కొనసాగిన వైకాపా నాయకుల నిరసనలు

విశాలాంధ్ర – నాగులుప్పలపాడు : ఓ పక్క ఉప్పుగుండూరులో ఎమ్మెల్యే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తుండగా అదే గ్రామంలో వైసీపీ నాయకులు ఎమ్మెల్యే ఓటమి కోరుతూ పోలేరమ్మకు మొక్కులు చెల్లించుకొని మూడో రోజు తమ నిరసన కొనసాగించారు.వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, నాయకులు, కార్యకర్తల పతనం దిశగా పనిచేస్తున్న ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర బాబు రాజకీయ ఓటమి చందాలని కోరుతూ వినూత్న రీతిలో వైసిపి సీనియర్ నాయకులు పూజలు నిర్వహించి మూడో రోజు తమ నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు.శుక్రవారం ఉప్పుగుండూరు గ్రామంలోని పోలేరమ్మ తల్లి దేవాలయంలో వైసిపి సీనియర్ నాయకులు మద్దిసాని నాగేశ్వరరావు, ఇమ్మిశెట్టి బాలకృష్ణ తదితర నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే అధికారంలో ఉన్నన్నాళ్ళు పార్టీ నాయకులు, కార్యకర్తల సంక్షేమం మరిచి బస్మాసురుడిలా తమను పతనం చేయాలని చూసినందుకు గాను పోలేరమ్మ తల్లి ఎమ్మెల్యే టి జే ఆర్ సుధాకర్ బాబుకు శాశ్వత రాజకీయ పతనం చేయాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2019 ఎన్నికలకు ముందు ఇప్పటి ఎమ్మెల్యే టీజర్ సుధాకర్ బాబు గెలుపొందాలని ఉప్పుగుండూరు గ్రామానికి చెందిన సీనియర్ నాయకులమైన తాము తమ వెంట నడిచిన కార్యకర్తలు పోలేరమ్మ తల్లికి మేకపోతును సమర్పించి మెక్కులు చెల్లించుకోవడం జరిగిందన్నారు ఆనాడు పోలేరమ్మ తల్లి కృప వల్ల ఎమ్మెల్యేగా సుధాకర్ బాబు గెలుపొందడం జరిగిందన్నారు గెలిచిన నాటినుండి ఆయన గెలుపు కోసం ఎన్నో కష్టనష్టాలను భరించి కృషిచేసిన తమను గుర్తించకుండా తన స్వార్థం కోసం తనకు నచ్చిన వారికి పదవులు ఉద్యోగాలను పార్టీ పదవులను అమ్ముకోవడం జరిగిందన్నారు రోజురోజుకీ నిజమైన పార్టీ కార్యకర్తలు అన్యాయానికి గురై ఏలాటి ప్రభుత్వ లబ్ది పొందకపోవడంతో పాటు ఎమ్మెల్యే అక్రమ కేసులను బనాయించడం జరిగిందన్నారు ఇన్ని రోజుల నుండి ఎమ్మెల్యే వ్యవహారశీలిని చూసి విసుకు చెందామన్నారు ఏమాత్రం పార్టీ సిద్ధాంతాలు అభివృద్ధి నాయకులు కార్యకర్తల సంక్షేమం పట్టించుకోకుండా ఒంటెద్దు పోకడ పోతున్న ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర బాబు కు వచ్చే ఎన్నికల్లో పార్టీ సీటు రాకుండా పోలేరమ్మ తల్లి కృప చూపాలన్నారు రానున్న రోజుల్లో ఆయన రాజకీయ భవితవ్యం అంధకారంలోకి వెళ్లాలని మెక్కులు తీర్చుకొని తమ నిరసనను తెలియజేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో నంబూరు నాగయ్య, సాదినేని నాగేశ్వరరావు, అత్తంటి వినోద్, కొలకలూరి సాంసన్, గురజాల పౌలు, కత్తి నాగర్జున ,కొలకలూరి ప్రసాదు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img