Saturday, April 13, 2024
Saturday, April 13, 2024

ఇసుక లారీ సీజ్

విశాలాంధ్ర -మద్దిపాడు: మండల పరిధిలో శనివారం రాత్రి అక్రమంగా ఇసుకనుతరలిస్తున్న లారీ సీజ్ చేసినట్లు చీమ కుర్తి ఎస్ .ఈ.బి ఎస్సై ఎం నగేష్ తెలిపారు. .మండల పరిధిలో ఎస్. ఈ. బి పోలీస్ సిబ్బంది అక్రమ ఇసుక తరలింపు విషయమై గుండ్లకమ్మ పరివాహక ప్రాంతం పరిశీలిస్తుండగా దొడ్డవరం గ్రామ శివారు లారీతో అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు గుర్తించి ఎస్సై తన సిబ్బందితో తనిఖీ నిర్వహించడం జరిగింది .ఈ తనిఖీల నందు లారీలో 15 టన్నుల ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నట్లు గుర్తించి డ్రైవర్ తో పాటు లారీ ను అదుపులోకి తీసుకొని స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు ఈ సందర్భంగా ఎస్ఐ ఎం నగేష్ మాట్లాడుతూ మండల పరిధిలోని గుండ్లకమ్మ నది పరీవాహక ప్రాంతం నందు అక్రమంగా ఇసుకను తరలించినట్లయితే వాహనాలను సీజ్ చేయడంతోపాటు జైలే గతి అవుతుందని అక్రమదారులను ఆయన హెచ్చరించారు.ఈ దాడుల న౦దుఏసీబీ కానిస్టేబుల్స్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img