Saturday, April 13, 2024
Saturday, April 13, 2024

ముండ్లమూరు లో చోరీ

విశాలాంధ్ర – ముండ్లమూరు : మండల కేంద్రమైన ముండ్లమూరు గ్రామానికి చెందిన వీరపనేని నాగేంద్రం ఇంటిలో దొంగతనం జరిగింది ఆ మేరకు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది నాగేంద్రం తెలిపిన వివరాల మేరకు జూలై 14వ తేదీన హైదరాబాదులో ఉన్న తన కుమారుని వద్దకు వెళ్లాను ఇరవై రోజుల తర్వాత తిరిగి తమ స్వగ్రామమైన ముండ్లమూరు మూడో తేదీ బుధవారం ఉదయం ఇంటికి వచ్చి మెయిన్ గేటు తాళం తీసి లోపలికి వెళ్ళాను ఇంటి లోపల మొదటి ద్వారం వేసిన తాళం వేసినట్టు గానే ఉందని ఉత్తరం వైపు ఉన్న తలుపు తాళం పగలగొట్టి తలుపు తీసి ఉందని అనుమానం వచ్చి లోపలికి వెళ్లి చూడగా బెడ్ రూమ్ లో దుస్తులు చిందరవందరగా పడి ఉన్నాయని బీరువా తాళం పగలకొట్టి తెరిచి ఉండడంతో కంగారుపడి బీరువాలో ఉన్న వస్తువులు ఉన్నాయో లేవో చూడగా 8 జతల బంగారం కమ్మలు 3 ఉంగరాలు1 చైన్ చిన్నది 37 వేల నగదు చీరలు కనిపించడం లేదని వాపోయింది ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు సమాచారం చేరవేసింది దీంతో క్లూస్ టీమ్ ఎస్ఐ పి శరత్ బాబు బృందం వచ్చి ఇంటి లోని అన్ని పరిసరాలను వేలిముద్రలు సేకరించి వెళ్లారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img