Tuesday, October 4, 2022
Tuesday, October 4, 2022

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి – ఒకరికి గాయాలు

విశాలాంధ్ర జే పంగులూరు:-
మండలంలోని కొండమంజూరు గ్రామ జాతీయ రహదారి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం జరిగింది. రొడ్డు ప్రమాదం లో ఇరువురు మృతి చెందారు ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న ఎస్సై తిరుపతిరావు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఎస్సై అందించిన సమాచారం ప్రకారం
తిరుపతి నుండి చిలకలూరిపేట వైపు వెళ్తున్న ఎపి-03/బిపి-4455 నెంబరు గల ఇన్నోవా కారు డ్రైవర్ అయిన చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి గంగుపల్లి భాస్కర్, కారును అతివేగంగా అజాగ్రత్తగా నడుపుతూ, జె. పంగులూరు మండలం, కొండ మంజులూరు క్రాస్ రోడ్డు వద్దకు వచ్చేసరికి, ముందు వెళ్తున్న
టి యన్-34/పి-7403 నెంబర్ గల లారీని వెనక వైపు ఢీకొనగా, కారు డ్రైవర్ అయిన గంగుపల్లి భాస్కర్ కు తీవ్ర రక్త గాయములైనవి, భాస్కర్ పక్క సీట్లో కూర్చొని ఉన్న చంద్రగిరి మండల తెలుగు యువత అధ్యక్షుడు కొండాది భాను ప్రకాష్, 31 సంవత్సరములు, తీవ్ర గాయాలతో ప్రమాద స్థలములోనే చనిపోయినాడు. వెనుక సీట్లో కూర్చుని ఉన్న సోమశేఖర్ రెడ్డికి కూడా రక్తగాయములైనవి గాయాలయ్యాయి. మృతి చెందిన భాను ప్రకాష్ ను పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. తీవ్ర గాయాలైన సోమశేఖర్ రెడ్డినీ హైవే అంబులెన్స్ ద్వారా ఒంగోలు కిమ్స్ తరలించారు. వైద్యం అందిస్తుండగా సోమశేఖర్ రెడ్డి మరణించారు. మరొకరికి కూడా గాయాలు కావడంతో వైద్యం అందిస్తున్నట్లు ఎస్సై తిరుపతిరావు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img