Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

గడపగడపలో సంక్షేమం, సంతోషం

జగన్‌ ప్రభుత్వంలో ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి

విశాలాంధ్ర-యర్రగొండపాలెం : అవ్వా పెన్షన్‌ వస్తుందా అమ్మా బాగున్నారా అంటూ మంత్రి ఆదిమూలపు సురేష్‌ పలకరించడంతో ఆ అవ్వ, తాతా, అమ్మలు ఎంతగా మురిసిపోయారో వాళ్ళ ముఖాలు చూస్తే అర్థమవుతోంది. తమ మనవడు, తమ బిడ్డే పలకరించినట్లుగా ఆనందపడి పోయారు. రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ గడపగడపకు మన ప్రభుత్వం మూడవ రోజు కార్యక్రమంలో భాగంగా శనివారం నాడు వర్షం పడుతున్న పర్యటించారు. ప్రతి ఇంటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించడంతోపాటు, సక్రమంగా అందాయా లేదా అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రజలు సూచించిన కొన్ని సమస్యలను అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. ఈ క్రమంలో ఓ తాతను చూసి తాతా పెన్షన్‌ వస్తుందా అని అడిగేసరికి ఎంతగానో సంతోష పడిపోయాడు. రాష్ట్రానికి మంత్రిగా ఎంతో బిజీగా ఉన్నా కూడా తన యోగక్షేమాలను అడిగి తెలుసుకోవడంతో ఆ తాతా ఎంతగానో మురిసిపోయాడు. అలాగే ఓ అమ్మను, అమ్మా బాగున్నావా అంటూ పలకరించడంతో, ఆమె మంత్రి పలకరింపుతో ఉబ్బితబ్బిబై పోయింది. ఓ మంత్రిగా, శాసనసభ్యునిగా కాకుండా ఇంటి పెద్ద బిడ్డగా అందరి యోగక్షేమాలను తెలుసుకుంటూ ముందుకు వెళుతున్న మంత్రికి అడుగడుగునా ఘన స్వాగతం లభిస్తోంది. తాము ప్రభుత్వం ద్వారా పొందిన సంక్షేమ పథకాల లబ్ధిని మంత్రితో ఆనందంగా పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img