Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

విశాలాంధ్ర – కనిగిరి : మహిళలు హక్కులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని, అప్పుడే వారు తమ సమస్యలను పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని కనిగిరి మున్సిపాలిటీ చైర్మన్ న్యాయవాది షేక్ అబ్దుల్ గఫార్ పేర్కొన్నారు. గురువారము కనిగిరి పాతూరు సచివాలయంలో హర్ ఘర్ తిరంగా క్యాంపెయిన్ లో భాగంగా మహిళ హక్కులు చట్టాలు మరియు వైవాహిక సమస్యల పై మండల న్యాయ సేధికార సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు.న్యాయవాదులు పాశం పిచ్చయ్య, సయ్యద్ షాహిద్ మాట్లాడుతూ మహిళలపై లైంగిక వేధింపులు, నేరాలు,పోక్సో చట్టం వంటి చట్టాలను అవగాహన పరిచారు. ఈ కార్యక్రమంలో మెప్మా రఘు, సచివాలయ అడ్మిన్ స్రవంతి, పారా లీగల్ వాలంటీర్ గుడ్ హెల్ప్ ఫౌండేషన్ డైరెక్టర్ రమేష్ బాబు, దాసరి మురళి, ఖాలక్ మెప్మా ఆర్పీలు మహిళా సభ్యులు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు, న్యాయ సేవ అధికార సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img