Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

ఆ నలుగురి ఫామ్‌పై ఆందోళన

న్యూదిల్లీ : టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టుకు ఎంప ికైన 15 మందిలో నలుగురు ఆటగాళ్ల పేలవ ఫామ్‌ బీసీసీఐని కలవర పెడుతోంది. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ తరఫున ఆడుతున్న ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, హార్ధిక్‌ పాండ్యా, రాహుల్‌ చాహర్‌లు.. ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమయ్యారు. యూఏఈ వేదికగా జరుగుతున్న రెండో దశలో ఇప్పటివరకు 3 మ్యాచ్‌లు ఆడిన ఇషాన్‌ కిషన్‌(11, 14, 9 పరుగులు), సూర్యకుమార్‌ యాదవ్‌(3, 5, 8 పరుగులు), రాహుల్‌ చాహర్‌ (ఒక్క వికెట్‌) దారుణమైన గణాంకా లను నమోదు చేయగా.. చాలా కాలంగా ఫిట్‌నెస్‌ సమస్యలు, ఫామ్‌ లేమితో సతమత మవుతున్న ఆల్‌రౌండర్‌ హార్ధిక్‌ పాండ్యా ఈ ఏడాది ఐపీఎల్‌లో ఒక్క బంతి కూడా బౌల్‌ చేయకపోవడంతో పాటు బ్యాటింగ్‌లో 8 ఇన్నింగ్స్‌ల్లో 7.85 సగటున పరుగులు చేసి ఘోరంగా విఫలమయ్యాడు. దీంతో ఈ నలుగురు ఆటగాళ్ల ఎంపికపై బీసీసీఐ, సెలెక్టర్లు పునరాలోచనలో పడి నట్లు తెలుస్తోంది. ఫామ్‌లో లేని వీరిని తప్పించి ఐపీఎల్‌లో రాణిస్తున్న దేవ్‌దత్‌ పడిక్కల్‌, శిఖర్‌ ధవ న్‌, శ్రేయస్‌ అయ్యర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, దీప క్‌ చహర్‌, చాహల్‌లకు అవకాశం కల్పిం చాలని భావిస్తున్నట్లు సమాచారం. కాగా, ఈ విషయమై బీసీసీఐకి చెందిన ఓ అధికారి స్పందిస్తూ.. ప్రస్తుతం ఆ నలుగురు ఫామ్‌ ఆందోళన కరంగానే ఉన్నప్పటికీ మిగతా ఐపీఎల్‌ మ్యాచ్‌లు ముగియడానికి మరో 12 రోజుల సమయం ఉన్నందున వాళ్లు తిరిగి ఫామ్‌లోకి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి కూడా కొంతకాలంగా ఫామ్‌లో లేకపోయినా.. ఇప్పుడు వరుస హాఫ్‌ సెంచరీలతో తిరిగి ఫామ్‌లోకి వచ్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. రానున్న మ్యాచ్‌ల్లో ఈ నలుగురు ఆశించిన మేరకు రాణించకపోతే వారిని తప్పించేందుకు బీసీసీఐ ఏమాత్రం వెనుకడుగు వేయకపోవచ్చని, వారి స్థానాల భర్తీ విషయమై శ్రేయస్‌ అయ్యర్‌ సహా పలు ఆప్షన్లు బీసీసీఐ పరిశీలనలో ఉన్నాయని పేర్కొన్నాడు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img