Thursday, September 29, 2022
Thursday, September 29, 2022

ఐపీఎల్‌కు అందుబాటులో ఇంగ్లండ్‌ క్రికెటర్లు

లండన్‌ : ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు ఇటీవలే పాకిస్థాన్‌ పర్యటనను రద్దు చేసుకుంటూ కీలక నిర్ణయం తీసుకోవడంతో ఐపీఎల్‌ మరింత జోష్‌తో ముందుకు సాగనుంది. తొలుత పాక్‌ పర్యటన దృష్ట్యా కొందరు ఇంగ్లండ్‌ ఆటగాళ్లు ఐపీఎల్‌కు దూరం కానున్నట్లు పేర్కొన్నారు. కానీ, పాక్‌ పర్యటన రద్దు చేస్తూ ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు తీసుకున్న నిర్ణయంతో.. ఐపీఎల్‌ చివరి వరకూ ఇంగ్లండ్‌ ఆటగాళ్లు తమ ఫ్రాంచైజీల తరఫున ఆడనున్నట్లు ప్రకటించారు. వీరిలో సామ్‌ కరన్‌, మొయిన్‌ అలీ, మోర్గాన్‌ సహా.. టామ్‌ కరన్‌, సామ్‌ బిల్లింగ్స్‌, క్రిస్‌ జోర్డాన్‌, అదిల్‌ రషీద్‌, జేసన్‌ రాయ్‌, జార్జ్‌ గార్టన్‌ ఉన్నారు. కొద్ది రోజుల క్రితమే న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు భద్రతా కారణాల దృష్ట్యా పాక్‌ పర్యటనను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది.
ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు కూడా పాకిస్థాన్‌కు షాకిచ్చింది. ఈ నిర్ణయంపై పీసీబీ చీఫ్‌ రమీజ్‌ రాజా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img