Friday, April 26, 2024
Friday, April 26, 2024

కుప్పకూలిన ఆర్సీబీ.. 92 పరుగులకు ఆలౌట్‌

అబుదాబి : ఐపీఎల్‌-2021 రెండో దశలో భాగంగా సోమవారం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆర్సీబీ, వంద పరుగులు కూడా చేయలేక పోయింది. 19 ఓవర్లలో 92 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఆదిలోనే ఆర్సీబీకి భారీ షాక్‌ తగిలింది. ఆ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (4 బంతుల్లో 5) రెండో ఓవర్లోనే పెవిలియన్‌కు చేరాడు. ప్రసిద్ధ్‌ కృష్ణ బౌలింగ్‌లో బౌండరీ బాది జోరుమీదున్నట్లు కనిపించిన కోహ్లి.. అతరువాతి బంతికే ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆ తర్వాత మరో ఓపెనర్‌ దేవ్‌దత్‌ పడిక్కల్‌ (22) ఇన్నింగ్స్‌ 6వ ఓవర్‌ ఆఖరి బంతికి ఫెర్గూసన్‌ బౌలింగ్‌లో వికెట్‌కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటవగా, అరంగేట్రం కుర్రాడు శ్రీకర్‌ భరత్‌(19 బంతుల్లో 16 ) ఏమాత్రం ప్రభావం చూపకుండానే వెనుదిరిగాడు. రసెల్‌ వేసిన 9వ ఓవర్‌ తొలి బంతికి శుభ్‌మన్‌ గిల్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఇదే ఓవర్‌లో ప్రమాదకర ఆటగాడు డివిలియర్స్‌ను రసెల్‌ గోల్డెన్‌ డక్‌గా పెవిలియన్‌కు సాగనం పాడు. డివిలియర్స్‌ ఎదుర్కొన్న తొలి బంతికే క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. కొద్దిసేపటికే స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి మూడు వికెట్లు పడగొట్టి ఆర్సీబీని కోలుకో నీయకుండా చేశాడు. వరుస బంతుల్లో మ్యాక్స్‌ వెల్‌ (10), హసరంగ (0)ను ఔట్‌ చేసిన చక్రవర్తి, సచిన్‌ బేబీ (7)ని కూడా పెవిలియన్‌కు పంపాడు. దీంతో ఆర్సీబీ 76 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఆ తర్వాత కైల్‌ జమీసన్‌ (4) రనౌట్‌ కాగా హర్సల్‌ పటేల్‌ (12 ), సిరాజ్‌ (8) పెవిలియన్‌కు క్యూ గట్టారు. చాహల్‌ (2) నాటౌట్‌గా నిలిచాడు. కేకేఆర్‌ బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తి 3, రసెల్‌ 3, ప్రసిద్ధ్‌ కృష్ణ ఒకటి, ఫెర్గూసన్‌ రెండు వికెట్లు పడగొట్టారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img