Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

టీ20..4, 6 స్థానాల్లో కోహ్లీ, రాహుల్‌


లండన్‌ : అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌(ఐసీసీ) తాజాగా ప్రకటించిన పురుషుల టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఒక స్థానం ఎగబాకి 4 వ స్థానంలో నిలిచాడు. మరో భారత బ్యాట్స్‌మన్‌ కేఎల్‌ రాహుల్‌ ఆరో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. కాగా ఇంగ్లండ్‌ ఆటగాడు డేవిడ్‌ మలాన్‌ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ రెండువ స్థానంలో, ఆస్ట్రేలియా వైట్‌ బాల్‌ కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ 3 వ స్థానంలో నిలిచారు. దక్షిణాఫ్రికా ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ నాలుగు స్థానాలు మెరుగుపడి ఎనిమిదో స్థానానికి చేరుకున్నాడు. మరో వైపు బౌలర్లలో దక్షిణాఫ్రికా స్పిన్నర్‌ తబ్రాజ్‌ షమ్సీ ఆగ్రస్థానంలో కొనసాగుతండగా, శ్రీలంక హాఫ్‌ స్పిన్నర్‌ వనిందు హసరంగా రెండో స్థానంలో నిలిచాడు. బంగ్లాదేశ్‌ పాస్ట్‌ బౌలర్‌ ముస్తాఫిజుర్‌ రెహమాన్‌ రెండు స్థానాలు ఎగబాకి 8 వ స్థానంలో నిలిచాడు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img