Friday, October 7, 2022
Friday, October 7, 2022

ప్రియుడితో టెన్నిస్‌ స్టార్‌ వివాహం

బుచారెస్ట్‌ : రొమేనియాకు చెందిన ప్రముఖ టెన్నిస్‌ క్రీడాకారిణి, మాజీ నెం.1 సిమోనా హలెప్‌ తన ప్రియుడు, వ్యాపార వేత్త టోనీ ఐరుక్‌ని బుధవారం వివాహమాడిరది. ఈ వేడుకకు రొమేనియా అధ్యక్షుడు హాజర్యయారు. కొవిడ్‌ నిబంధనల ప్రకారం 300 మంది సన్నిహితుల మధ్య వీరి వివాహం జరిగింది. మాజీ టెన్నిస్‌ క్రీడాకారులు ఇలీ నాస్టాసే, అయాన్‌ టిరియాక్‌తో పాటు రొమేనియా అధ్యక్షుడు క్లౌస్‌ ఐయోన్నీస్‌ ఈ వేడుకకు హాజరయ్యారు. సిమోన్‌ హలెప్‌.. రొమేనియా ఉత్తమ టెన్నిస్‌ ప్లేయర్లలో ఒకరు. ఇప్పటివరకు రెండు గ్రాండ్‌స్లామ్స్‌ గెలుచుకుంది. 2018లో ఫ్రెంచ్‌ ఓపెన్‌, 2019లో వింబుల్డన్‌ చాంపియన్‌గా నిలిచింది. 2017, 2019 లలో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండుసార్లు ప్రపంచ నెం.1 టెన్నిస్‌ క్రీడాకారిణిగా నిలిచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img