Tuesday, November 29, 2022
Tuesday, November 29, 2022

సెమీస్‌కు దూసుకెళ్లిన సింధు, లవ్లీనా

టోక్యో : భారత అగ్రశ్రేణి షట్లర్‌, ప్రపంచ ఛాంపియన్‌ పీవీ సింధు.. టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించడమే ధ్యేయంగా దూసుకుపోతోంది. శుక్రవారం జరిగిన బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్‌లో జపాన్‌ క్రీడాకారిణి యమగూచిపై వరుస సెట్ల (2113, 2220) లో గెలుపొందిన సింధు సెమీస్‌కు దూసుకెళ్లింది. ఫైనల్‌లో ప్రవేశించేందుకు సింధు ప్రపంచ నంబర్‌-1 చైనీస్‌ తైఫీ షట్లర్‌ తై జుయింగ్‌తో శనివారం తలపడనుంది. ఈ మ్యాచ్‌ 56 నిమిషాల పాటు ఉత్కంఠభరితంగా సాగింది. తొలి గేమ్‌ను 21-13తో అలవోకగా నెగ్గిన సింధుకు రెండో గేమ్‌లో ప్రత్యర్థి నుంచి గట్టిపోటీ ఎదురైంది. ఒకదశలో 20-18తో ఆధిక్యంలో వెళ్లిన యమగూచి గేమ్‌ పాయింట్‌కు చేరువై సింధుపై ఒత్తిడి పెంచింది. ఆ దశలో పుంజుకున్న సింధు 22-20తో రెండో గేమ్‌ నెగ్గి మ్యాచ్‌ సొంతం చేసుకుంది. సెమీస్‌లో అడుగు పెట్టింది. సింధు, తై జు యింగ్‌ మధ్య ఇప్పటి వరకు 18 మ్యాచ్‌లు జరగగ్గా.. 13 మ్యాచ్‌ల్లో తై జు యింగ్‌, 5 మ్యాచుల్లో సింధు గెలుపొందింది. ఇప్పటివరకు తై జు యింగ్‌ ఒలింపిక్స్‌లో పతకం నెగ్గలేదు. రియో ఒలింపిక్స్‌లో తై జు యింగ్‌ను సింధు ఓడిరచింది.
సింధు రికార్డు.. : పీవీ సింధు మరో రికా ర్డును తన ఖాతాలో వేసుకుంది. రెండుసార్లు వరుసగా ఒలింపిక్స్‌ సెమీస్‌కు చేరిన తొలి భారత క్రీడాకారిణిగా ఘనత సాధించింది. కాగా యమగూచితో మ్యాచ్‌ అనంతరం సింధు మాట్లాడుతూ.. ఇప్పుడే అంతా అయి పోయి నట్లు కాదని పేర్కొంది. తదుపరి మ్యాచ్‌కు మరింత కఠినంగా సన్నద్ధ మవ్వా ల్సిన అవసరం ఉందని తెలిపింది. గెలుపు కోసం తాను చాలా కఠి నంగా శ్రమిం చానని, కోచ్‌ ఎంతగానో ప్రోత్సహించారని తెలిపింది.
లవ్లీనా పంచ్‌ అదిరింది.. : బాక్సింగ్‌ మహిళల వెల్టర్‌ వెయిట్‌ (69 కేజీలు) విభాగంలో భారత బాక్సర్‌ లవ్లీనా బోర్గోహైన్‌ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. క్వార్టర్స్‌లో ఆమె చైనీస్‌ తైపీ బాక్సర్‌, మాజీ ప్రపంచ ఛాంపియన్‌ నీన్‌ చిన్‌ చెన్‌ పై 4-1 తేడాతో విజయం సాధించింది. తదుపరి ఆగస్టు 4న జరిగే సెమీఫైనల్లో.. టర్కీ బాక్సర్‌ సుర్మేనేలి బుసానాజ్‌తో లవ్లీనా తలపడనుంది. అందులో గెలిస్తే.. ఫైనల్‌కు చేరుతుంది. ఓడినా.. ఆమెకు కాంస్యం దక్కుతుంది.
బంగారు పతకం సాధిస్తా..
మ్యాచ్‌ అనంతరం మాట్లాడిన లవ్లీనా.. బంగారు పతకం సాధిస్తానని ధీమా వ్యక్తం చేసింది. ఉన్నది ఒకటే మెడల్‌ అని.. అది గోల్డేనని స్పష్టం చేసింది. ప్రస్తుతం సెమీఫైనల్‌ కోసం సాధన చేస్తానని తెలిపింది. బాక్సింగ్‌లో ఫైనల్లో గెలిచిన వారికి బంగారు పతకం, రన్నరప్‌కు రజతం ఇస్తారు. సెమీఫైనల్లో ఓడిన ఇద్దరికీ కాంస్యం దక్కుతుంది. భారత్‌కు ఇప్పటికే ఈ ఒలింపిక్స్‌? లో ఓ రజత పతకం వచ్చింది. మహిళల వెయిట్‌లిఫ్టింగ్‌ 49 కేజీల విభాగంలో మీరాబాయి చాను.. రెండో స్థానంలో నిలిచి రజత పతకం సాధించింది. 23ఏళ్ల లవ్లీనా ఒలింపిక్స్‌లో ఆడటం ఇదే తొలిసారి. క్వార్టర్స్‌లో ప్రత్యర్థి ప్రపంచ మాజీ ఛాంపియన్‌ అయినప్పటికీ లవ్లీనా తొలి రౌండ్‌ నుంచే దూకుడుగా పంచ్‌లు విసిరింది. ప్రత్యర్థి కూడా అంతే వేగంగా స్పందించింది. ముగ్గురు న్యాయమూర్తులు లవ్లీనాకు ఓటు వేయడంతో 3-2తో తొలి రౌండ్‌ను గెలుచుకుంది. రెండో రౌండ్‌లో మరింత దూకుడుగా ఆడి 5-0తో బౌట్‌ ముగించింది. మూడో రౌండ్‌ను 4-1తో సొంతం చేసుకుంది. మొత్తంగా ఈ పోరులో 30-27, 29-28, 28-29, 30-27, 30-27తో లవ్లీనా ఘన విజయం అందుకుంది. ఒలింపిక్‌ క్రీడల్లో బాక్సింగ్‌ విభాగంలో భారత్‌కు పతకం అందిస్తున్న మూడో బాక్సర్‌ లవ్లీనానే కావడం విశేషం. అంతకుముందు 2008లో విజేందర్‌ సింగ్‌, 2012లో మేరీ కోమ్‌ ఒలింపిక్‌ పతకం సాధించారు. వీరిద్దరికీ కాంస్యాలే దక్కాయి. అంతేగాక, బాక్సింగ్‌లో 69 కేజీల విభాగంలో భారత్‌కు తొలి ఒలింపిక్‌ పతకం అందిస్తున్నది కూడా లవ్లీనానే. ఈమె గతంలో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రెండు సార్లు కాంస్య పతకాలు గెలిచింది.
హాకీలో అదుర్స్‌..
ఒలింపిక్స్‌లో భారత హాకీ పురుషుల జట్టు వరుస విజయాలతో పతకంపై ఆశలు రేపుతోంది. పూల్‌-ఎలో భాగంగా జపాన్‌తో జరిగిన పోరులో 5-3తో విజయం సాధించింది. గుర్జంత్‌ సింగ్‌ రెండుసార్లు స్ట్రైక్‌ చేయడంతో భారత్‌ ఖాతాలో మరో విజయం వచ్చి పడిరది. గుర్జంత్‌కు తోడు హర్మన్‌ప్రీత్‌ సింగ్‌, నీలకంఠశర్మ, సిమ్రజీత్‌ సింగ్‌ గోల్స్‌ సాధిం చడంతో భారత జట్టు వరుసగా మరో విజయాన్ని అందుకుంది. డిపెండిరగ్‌ ఛాంపియన్‌ అర్జెంటీనాతో జరిగిన పోరులో 3-1తో విజయం సాధించిన భారత జట్టు జపాన్‌పై కూడా అదే దూకుడు ప్రదర్శించింది. క్వార్టర్‌ ఫైనల్‌లో ఇప్పటికే బెర్త్‌ ఖరారు చేసుకున్న భారతజట్టు పూల్‌-ఎలో చివరి మ్యాచ్‌ను విజయంతో ముగించింది. తాజా విజయంతో పూల్‌-ఎలో భారత జట్టు రెండో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా తొలి అగ్రస్థానంలో కొనసాగుతోంది.
ఐర్లాండ్‌పై మహిళా జట్టు విజయం
ఒలింపిక్స్‌లో భారత మహిళల హాకీ జట్టు ఖాతా తెరిచింది. పూల్‌ ఎలో భాగంగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 1`0 గోల్స్‌ తేడాతో విజయం సాధించి క్వార్టర్‌ ఫైనల్‌ ఆశలు సజీవంగా ఉంచింది. మూడు వరుస పరాజయాల తర్వాత భారత జట్టుకు ఇది తొలి విజయం. శనివారం దక్షిణ కొరియాతో జరిగే మ్యాచ్‌లో విజయం సాధిస్తే క్వార్టర్‌ ఫైనల్‌ అవకాశాలు ఉంటాయి. ఈ మ్యాచ్‌లో అందివచ్చిన 14 పెనాల్టీ కార్నర్లను గోల్స్‌గా మలచడంలో విఫలమైన రాణీ సేన.. ఫీల్డ్‌ గోల్‌ ద్వారా విజయాన్ని అందుకుంది. అది కూడా మ్యాచ్‌ ముగియడానికి మూడు నిమిషాల ముందు ఈ గోల్‌ లభించింది. నవనీత్‌ కౌర్‌ రివర్స్‌ హిట్‌తో అద్భుతంగా గోల్‌ చేసింది.
మను బాకర్‌కు నిరాశ..
షూటింగ్‌లో ఆశలు పెంచిన మను బాకర్‌ మళ్లీ ఫైనల్‌ చేరడంలో విఫలమైంది. తుది 8 మందిలో నిలవలేకపోయింది. 600 పాయిం ట్లకు గానూ 582 స్కోరు చేసింది. క్వాలిఫికేషన్‌ ప్రెసిషన్‌లో 292 స్కోరు చేసిన మను.. ర్యాపిడ్‌ ఫైర్‌ రౌండ్‌?లో 2 పాయింట్లు తక్కువగా స్కోరు చేసింది.
చరిత్ర సృష్టించి ఓటమిపాలైన దీపిక
ఆర్చరీలో క్వార్టర్‌ ఫైనల్‌కు చేరిన తొలి భారతీయ క్రీడాకారిణిగా రికార్డు సృష్టించిన దీపికా కుమారి కీలక మ్యాచ్‌లో ఓడి నిరాశ పరిచింది. పతకం ఖాయమనుకున్న వేళ కొరియా సెన్షేనల్‌ యాన్‌ శాన్‌ చేతిలో 0-6తో ఓటమి పాలైంది. ఇప్పటి వరకు అసాధారణ ప్రతిభ కనబరిచిన దీపిక క్వార్టర్‌ ఫైనల్‌లో మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. కాగా, టోక్యో గేమ్స్‌లో మూడో పతకంపై కన్నేసిన యాన్‌ ఇప్పటికే రెండు పతకాలు అందుకుంది. మహిళల టీమ్‌తోపాటు మిక్స్‌టీ ఈవెంట్‌లోనూ పతకాలు గెలుచుకుంది. వరుస సెట్లను కోల్పోయిన దీపిక తీవ్ర నిరాశ చెందింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img