Tuesday, May 7, 2024
Tuesday, May 7, 2024

అండర్‌`20 ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ ఉరుగ్వే కైవసం

ఎస్డాడియానికో(అర్జెంటీనా): దక్షిణ అమెరికాకు చెందిన ఉరుగ్వే పురుషల ఫుట్‌బాల్‌ జట్టు చరిత్ర సృష్టించింది. అండర్‌ -20 ప్రపంచ కప్‌ చాంపియన్‌గా అవతరించింది. దాంతో, 12 ఏళ్ల తర్వాత ప్రపంచకప్‌ గెలిచిన తొలి దక్షిణ అమెరికా దేశంగా రికార్డు సాధించింది. అంతేకాదు వరుసగా నాలుగేళ్లుగా ట్రోఫీని ఎగరేసుకుపోతున్న యూరోపియన్‌ దేశాల హవాకు స్వస్తి పలికింది. ఆదివారం డిగో మారడోన స్టేడియం లో జరిగిన ఫైనల్లో ఉరుగ్వే 1-0తో ఇటలీపై గెలుపొందింది. ఆ జట్టు స్టార్‌ ప్లేయర్‌ లుసియానో రోడ్రిగెజ్‌ 86వ నిమిషంలో గోల్‌ సాధించడంతో ఉరుగ్వే జట్టు ఆటగాళ్లంతా సంబురాలు చేసుకున్నారు. ‘ఇది చాలా క్రేజీ.. క్రేజీ.. క్రేజీ.. మేము ఈ విజయానికి అర్హులం. మా కలను నిజం చేసుకున్నాం’ అని రోడ్రిగ్‌ మ్యాచ్‌ అనంతరం ఉద్వేగభరితంగా చెప్పాడు. ఉరుగ్వే 1997, 2013లో ఫైనల్లో అనూహ్యంగా ఓటమిపాలైంది. దక్షిణ అమెరికాకు చెందిన బ్రెజిల్‌ చివరిసారి 2011లో అండర్‌ -20 ప్రపంచకప్‌ అందుకుంది. కాగా మే 20న మొదలైన అండర్‌ -20 ప్రపంచకప్‌లో ఏమాత్రం అంచనాలు లేని ఉరుగ్వే, ఇటలీ సంచలన ఆటతో ఫైనల్‌కు దూసుకెళ్లాయి. టైటిల్‌ ఫేవరెట్లుగా బరిలోకి దిగిన బ్రెజిల్‌, అర్జెంటీనా, ఇంగ్లండ్‌ జట్లు టైటిల్‌ వేటకు అర్హత సాధించలేకపోయాయి. దక్షిణకొరియాను 3-1తో ఓడిరచిన ఇజ్రాయెల్‌ మూడో స్థానంలో నిలిచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img