Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

తడబడి నిలిచిన ఆసీస్‌

ట్రావిస్‌ హెడ్‌ సెంచరీ

లండన్‌: భారత్‌`ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్ల మధ్య ఇక్కడి కెన్నింగ్టన్‌ ఓవల్‌ మైదానంలో బుధవారం ప్రారంభమైన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా తొలిరోజు కడపటి వార్తలందేసరికి మూడు వికెట్లు కోల్పోయి 233 పరుగులు సాధించింది. ట్రావిస్‌ హెడ్‌ (106 బంతుల్లో 100 ) సెంచరీ సాధించగా, స్టీవెన్‌ స్మిత్‌ (149 బంతుల్లో 53 ) అర్ధ సెంచరీతో రాణించారు. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచ్చిన టీమిండియా సారథి రోహిత్‌ శర్మ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. ప్రారంభంలో భారత బౌలర్లు చెలరేగడంతో ఆస్ట్రేలియా బ్యాటర్లు మొదటి సెషన్‌లో నిదానంగా ఆడారు. భోజన విరామ సమయానికి ఆసీస్‌ 2 వికెట్ల నష్టానికి 73 పరుగులు సాధించింది. కాసేపట్లో లంచ్‌ అనగా… డేవిడ్‌ వార్నర్‌(43)ను శార్దూల్‌ ఠాకూర్‌ బోల్తా కొట్టించాడు. వార్నర్‌ బంతిని స్లిప్‌లో ఆడాలనుకున్నాడు. అయితే.. కీపర్‌ శ్రీకర్‌ భరత్‌ కుడివైపు డైవ్‌ చేస్తూ స్టన్నింగ్‌ క్యాచ్‌ పట్టాడు. దాంతో అర్ధసెంచరీకి చేరువలో ఉన్న వార్నర్‌ నిరాశగా వెనుదిరిగాడు. అతను ఔటవ్వడంతో రెండో వికెట్‌కు 69 పరుగుల భాగస్వామ్యానికి తెరపడిరది. తొలుత ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖవాజా(0) సిరాజ్‌ బౌలింగ్‌ శ్రీకర్‌ భరత్‌ క్యాచ్‌ పట్టడంతో డకౌట్‌ ఔటయ్యాడు. ఆ తర్వాత వార్నర్‌, లబుషేన్‌ ఆచితూచి ఆడి ఇన్నింగ్స్‌ నిర్మించారు. లంచ్‌ తర్వాత రెండో ఓవర్లోనే ఆస్రేలియాకు పెద్ద షాక్‌ తగిలింది. క్రీజులో కుదురుకున్న మార్నస్‌ లబుషేన్‌(26)ను షమీ బౌల్డ్‌ చేశాడు. షమీ వేసిన తొలి బంతిని డిఫెండ్‌ చేయాలనుకోగా బంతి మిస్‌ అయి ఆఫ్‌ స్టంప్‌ను తాకింది. దాంతో 76 పరుగుల వద్ద ఆసీస్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత ఆసీస్‌ బ్యాటర్లు భారత బౌలర్లపై ఆధిపత్యం చెలాయించారు. లబుషేన్‌ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ట్రావిస్‌ హెడ్‌(60 నాటౌట్‌ : 75 బంతుల్లో 10 ఫోర్లు) అటాకింగ్‌ గేమ్‌ ఆడాడు. మరోవైపు స్టీవ్‌ స్మిత్‌ క్రీజులో పాతుకుపోయాడు. స్మిత్‌ స్టాండ్‌ ఇవ్వడంతో హెడ్‌ రెచ్చిపోయి ఆడాడు. సిరాజ్‌, ఉమేశ్‌ యాదవ్‌ సహా శార్ధూల్‌ బౌలింగ్‌లో బౌండరీలతో విరుచుకుపడ్డాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు ఏకంగా 154 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఆసీస్‌ను పటిష్ఠ స్థితిలో నిలిపారు. ఈ జోడీని విడదీసేందుకు భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ స్పిన్నర్‌ జడేజాను దించినా ఫలితం లేకపోయింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img