Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఆ ఇద్దరు స్పిన్నర్లతో భారత్‌ ఆడొచ్చు: పాంటింగ్‌

లండన్‌: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. లండన్‌లోని ఓవల్‌ మైదానం వేదికగా భారత్‌`ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఇంగ్లాండ్‌ పిచ్‌లు ఎక్కువగా పేస్‌ బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటాయి కాబట్టి భారత్‌ ముగ్గురు ప్రధాన పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగుతుందా? లేక నలుగురు పేసర్లు, ఒక స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌తో ఆడుతుందా? అనే దానిపై తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ భారత్‌ స్పిన్‌ బౌలింగ్‌ గురించి మాట్లాడాడు. భారత్‌ ఇద్దరు స్పెషలిస్ట్‌ స్పిన్నర్లతో బరిలోకి దిగుతుందని, రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజాలను తుది జట్టులోకి తీసుకుంటుందని అభిప్రాయపడ్డాడు. ‘రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌ లను భారత్‌ తుది జట్టులోకి తీసుకుంటుందని భావిస్తున్నా. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో జడేజా ఆరో స్థానాన్ని నిలబెట్టుకోగలడు. అతని బ్యాటింగ్‌ ఎంతగానో మెరుగుపడిరది. అవసరమైతే జడ్డూ కొన్ని ఓవర్లు బౌలింగ్‌ కూడా చేస్తాడు కాబట్టి అతనిని జట్టులోకి తీసుకుంటుందని అనుకుంటున్నా. జడేజా కంటే అశ్విన్‌ చాలా నైపుణ్యమున్న, మెరుగైన టెస్ట్‌ బౌలర్‌ అనడంలో సందేహం లేదు. లోయర్‌ ఆర్డర్‌లో జడేజా బ్యాటింగ్‌లో రాణిస్తే ఆట నాలుగు లేదా ఐదో రోజు వరకు వెళ్లొచ్చు. అలా కాకుండా పిచ్‌ స్పిన్‌కు అనుకూలంగా మారితే భారత్‌కు రెండో స్పిన్నర్‌గా జడేజా రూపంలో మంచి బౌలర్‌ ఉంటాడు. నేనైతే జడేజాను కచ్చితంగా ఎంపిక చేస్తా’ అని రికీ పాంటింగ్‌ వివరించాడు. ఆస్ట్రేలియా ఒకే స్పిన్నర్‌ నాథన్‌ లయన్‌తో బరిలోకి దిగే అవకాశం ఉంది.
ఆస్ట్రేలియాకే విజయావకాశాలు: అక్రమ్‌
పాకిస్తాన్‌ దిగ్గజ బౌలర్‌ వసీం అక్రమ్‌ భారత్‌, ఆస్ట్రేలియా మధ్య జరిగే డబ్య్లూటీసీ ఫైనల్‌పై తన అభిప్రాయాన్ని వెల్లబుచ్చాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచ్‌ విజేతగా నిలిచేందుకు భారత్‌ కంటే ఆస్ట్రేలియాకే ఎక్కు వగా అవకా శాలు ఉన్నాయని, బౌలింగ్‌ విషయంలో కూడా భారత్‌ బలహీనంగా ఉందంటూ చెప్పు కొచ్చాడు. ‘ఓవల్‌ మైదానంలో సాధారణంగా ఆగస్టు చివరి వారంలో లేదా సెప్టెంబర్‌ మొదటిలోనే టెస్టు మ్యాచ్‌లు జరుగుతాయి. అప్పడు పిచ్‌ బాగా డ్రైగా ఉండడం వల్ల బ్యాట్లరకు అను కూలంగా ఉటుంది. కానీ భారత్‌, ఆస్ట్రేలియా మధ్య జరిగే డబ్ల్యూటీసీ పైనల్‌ జూన్‌ నెలలో జరుగుతుంది. ఇప్పుడు ఓవల్‌ పిచ్‌ చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. ఫలితంగా బంతి ఎక్కువగా బౌన్స్‌ అయ్యే అవకాశం ఉంది. ఇదే కాక డ్యూక్‌ బంతి ఎక్కువగా స్వింగ్‌ అవుతుంది’ అని చెప్పుకొచ్చాడు. అదీగాక ఆసీస్‌ బౌలర్లు బౌన్సర్లు ఎక్కువగా వేస్తే టీమిండియా బ్యాట్స్‌మెన్‌ కచ్చితంగా ఇబ్బంది పడతారన్నాడు. ‘భారత బౌలింగ్‌ కూడా ఆస్ట్రేలియాతో పోలిస్తే కాస్త బలహీనంగా ఉంది. నా వరకు అయితే ఆస్ట్రేలియానే టైటిల్‌ ఫేవరేట్‌’ అంటూ వసీం అక్రమ్‌ తెలిపాడు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img