Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

‘ఆమె’ గెలవకున్నా చరిత్రే..!

ఒలింపిక్స్‌లో పోటీపడిన
తొలి ట్రాన్స్‌జెండర్‌ లారెల్‌ హబ్బార్డ్‌


టోక్యో: క్రీడాకారులు ఎవరైనా జీవితంలో ఒక్కసారైనా ఒలింపిక్స్‌లో పాల్గొనాలనే ఆశిస్తారు. విశ్వవేదికపై పతకాలు సాధించి దేశానికి గర్వకారణంగా నిలవాలని భావిస్తారు. అందుకోసం ఎన్నో ఏళ్లు కఠిన శిక్షణపొంది అన్ని అడ్డంకులు దాటుకొని ఒలింపిక్స్‌లో బెర్తు ఖరారు చేసుకుంటారు. ఈ క్రమంలోనే అక్కడ విజేతగా నిలిస్తే ఏదో ఒక పతకంతో తిరిగొస్తారు. దాంతో వాళ్ల అభిమానులు, ఆ దేశ ప్రజలు గర్వంతో ఉప్పొంగిపోతారు. అలాంటి వారికి తగినంత గుర్తింపు కూడా దక్కుతుంది. అయితే, ఇదంతా సహజంగా పోటీపడాలనుకునే ఆడ, మగవారికి మాత్రమే ఇప్పటివరకూ ఒలింపిక్స్‌లో కొనసాగుతున్న పద్ధతి. కానీ, 2020 టోక్యో ఒలింపిక్స్‌ కొత్త సంప్రదాయానికి తెరదీసింది. అదే ట్రాన్స్‌జెండర్లకు కూడా ప్రవేశం కల్పించడం. నూతనంగా తీసుకొచ్చిన ఈ విధానంతో న్యూజిలాండ్‌కు చెందిన లారెల్‌ హబ్బార్డ్‌ అనే మహిళా ట్రాన్స్‌జెండర్‌.. ఒలింపిక్స్‌కు అర్హత సాధించి ప్రత్యేక గుర్తింపు సాధించింది. ఈ నేపథ్యంలోనే సోమవారం జరిగిన మహిళల 87G కేజీల వెయిట్‌లిఫ్టింగ్‌ విభాగంలో పోటీపడి ఓడిపోయింది. మూడు ప్రయత్నాల్లోనూ విఫలమవడంతో ఉత్తి చేతులతోనే ఇంటిముఖం పట్టింది. కాగా, విశ్వక్రీడల్లో ఆమె ఓడిపోయినా కొత్త చరిత్ర సృష్టించింది. ఇందులో పోటీపడిన తొలి ట్రాన్స్‌జెండర్‌గా రికార్డు నెలకొల్పడమే కాకుండా తనలాంటి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది. తన ప్రదర్శన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె సంతోషం వ్యక్తం చేసింది. తాను ఎప్పటికీ తనలాగే ఉండాలనుకుంటోందని చెప్పింది. ట్రాన్స్‌జెండర్‌గా ఒలింపిక్స్‌లో ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కినందుకు ఆనందం పంచుకుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img