Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఆసీస్‌ విజయలక్ష్యం 76 పరుగులు

. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 163 ఆలౌట్‌
. అర్ధ సెంచరీతో రాణించిన పుజారా
. 8 వికెట్లు పడగొట్టిన ఆసీస్‌ స్పిన్నర్‌ లియోన్‌

ఇండోర్‌ : భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్ట్‌ రెండో రోజు ఆట ముగిసింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ టీమిండియా ఆలౌట్‌ అయ్యి 163 పరుగులు మాత్రమే సాధించింది. ఆసీస్‌కు 76 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇంకెక్కడైనా అయితే ఇది చాలా సునా యాస లక్ష్యమే గానీ స్పిన్నర్లు చేలరేగు తున్న ఇండోర్‌ పిచ్‌లో కష్ట సాధ్యమే. బంతి సుడులు తిరుగుతుండడంతో బ్యాటర్లకు పరుగులు రాబట్టడం క్లిష్టంగా మారింది. బుధవారంతో పోల్చితే గురువారం పిచ్‌ పై టర్న్‌ మరీ ఎక్కువగా ఉంది. ఉదయం సెషన్లో ఆస్ట్రేలియా 11 పరుగుల వ్యవధిలో 6 వికెట్లు కోల్పోవడమే అందుకు నిదర్శనం. మూడోరోజు శుక్రవారం రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టనున్న ఆస్ట్రేలియాకు అగ్నిపరీక్ష తప్పేలా లేదు. 76 పరుగుల లక్ష్యం చిన్నదే అయినా, నిప్పుల కుంపటిని తలపిస్తున్న పిచ్‌ పై భారత స్పిన్నర్లను కంగారూలు ఏ విధంగా ఎదుర్కొంటారన్నది ఆసక్తి కలిగిస్తోంది. రెండో ఇన్నింగ్స్‌ ఆడిన భారత్‌… ప్రతికూలంగా మారిన పిచ్‌ పై అద్భుతపోరాటం సాగించిందనే చెప్పాలి. ముఖ్యంగా, ఛతేశ్వర్‌ పుజారా ఆట గురించి ఎంత చెప్పినా తక్కువే. బంతి ఎలా వస్తుందో ఏమాత్రం అంచనా వేయలేని ఈ పిచ్‌ పై ఎంతో ఓపిగ్గా ఆడిన పుజారా అర్ధసెంచరీ సాధించాడు. పుజారా 142 బంతుల్లో 59 పరుగులు చేసి ఎనిమిదో వికెట్‌ రూపంలో వెనుదిరిగాడు. పుజారా స్కోరులో 5 ఫోర్లు, 1 సిక్స్‌ ఉన్నాయి. ఇక శ్రేయాస్‌ అయ్యర్‌ (26), రవిచంద్రన్‌ అశ్విన్‌ (16), అక్షర్‌ పటేల్‌ (15 నాటౌట్‌) ఆసీస్‌ స్పిన్‌ దాడులను తీవ్రంగా ప్రతిఘ టించి విలువైన పరుగులు జోడిరచారు. కోహ్లీ 13, రోహిత్‌ శర్మ 12 పరుగులు చేయగా, గిల్‌ 5, జడేజా 7 పరుగులకు అవుటయ్యారు. ఆస్ట్రేలియా సీనియర్‌ స్పిన్నర్‌ నాథన్‌ లియోన్‌ 8 వికెట్లు పడగొట్టడం విశేషం. మిచెల్‌ స్టార్క్‌ 1, కుహ్నెమన్‌ 1 వికెట్‌ తీశారు. ఈ మ్యాచ్‌ లో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ లో 109 పరుగులు చేయగా, ఆసీస్‌ 197 పరుగులు చేయడం తెలిసిందే.
అనేక రికార్డులు…
మూడో టెస్టు రెండో రోజు అనేక రికార్డులు బద్ధలయ్యాయి. భారత పేస్‌ బౌలర్‌ ఉమేశ్‌ యాదవ్‌ 100 వికెట్ల క్లబ్‌లో చేరాడు. స్వదేశంలో వంద వికెట్లు తీసిన ఐదో భారత బౌలర్‌గా అతను రికార్డు సృష్టించాడు. రెండో రోజు ఐదు ఓవర్లు వేసిన ఉమేశ్‌ 12 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. కాగా వ ఆస్ట్రేలియా స్పిన్నర్‌ నాథన్‌ లియోన్‌ ఎనిమిది వికెట్ల ప్రదర్శనతో భారత్‌ను దెబ్బ తీశాడు. దాంతో, టీమిండియాపై ఎక్కువ వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు. శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌ను అతను వెనక్కి నెట్టాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఛతేశ్వర్‌ పూజారాను ఔట్‌ చేసి లియోన్‌ మరో రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు 13 సార్లు పూజారా అతని బౌలింగ్‌ లో ఔట్‌ అయ్యాడు. దాంతో లియోన్‌ బౌలింగ్‌లో ఎక్కువ సార్లు ఔటైన భారత బ్యాటర్‌గా పూజారా రికార్డుల్లోకి ఎక్కాడు. అజింక్య రహానేను 10 సార్లు, రోహిత్‌ శర్మను 8 సార్లు, విరాట్‌ కోహ్లీని 7 సార్లు ఈ ఆసీస్‌ స్పిన్నర్‌ పెవిలియన్‌కు పంపాడు. భారత గడ్డపై లియోన్‌ ఐదు వికెట్లు తీయడం ఇది ఐదోసారి. దాంతో అతను ఆసీస్‌ మాజీ బౌలర్‌ రిచీ బెనౌడ్స్‌ సరసన చేరాడు. ఇప్పటివరకు లియోన్‌ 9 సార్లు టీమిండియాపై ఈ ఫీట్‌ సాధించాడు. రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు తీశాడు. ఇక టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా 2019 జనవరి నుంచి రెండంకెల స్కోర్‌ చేయకుండా ఔట్‌ కావడం ఇదే మొదటిసారి. ఇప్పటి వరకు అతను రెండు సార్లు మాత్రమే 10 లోపు వికెట్‌ సమర్పించుకు న్నాడు. 1978 నుంచి టెస్టుల్లో భారత జట్టు 200 పరుగుల లోపే ఆలౌట్‌ కావడం ఇది రెండోసారి. అంతేకాదు రెండు ఇన్నింగ్స్‌ల్లో తక్కువ ఓవర్లు (93.5) బ్యాటింగ్‌ చేయడం కూడా ఇది రెండోసారి మాత్రమే.
నాలుగో బౌలర్‌గా…
ఇండోర్‌ టెస్టులో నాథన్‌ లియోన్‌ అరుదైన మైలురాయికి చేరువయ్యాడు. మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ డెన్నిస్‌ లిల్లీ రికార్డును సమం చేశాడు. ఆస్ట్రేలియా తరఫున అత్యధికంగా 5 వికెట్లు తీసి నాలుగో బౌల ర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ జాబితాలో దివంగత, దిగ్గజ లెగ్‌ స్పిన్నర్‌ షేన్‌ వార్న్‌ మొదటి స్థానంలో ఉన్నాడు. అతను 37 సార్లు ఐదు వికెట్లు పడగొ ట్టాడు. గ్లెన్‌ మెక్‌గ్రాత్‌ (29 సార్లు) రెండో స్థానంలో, డెన్నిస్‌ లిల్లీ (23 సార్లు) మూడో స్థానంలో ఉన్నారు. అంతేకాదు బోర్డర్‌`గవాస్కర్‌ ట్రోఫీ ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధికంగా ఐదు వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా లయాన్‌ గుర్తింపు సాధించాడు. భారత లెజెండరీ స్పిన్నర్‌ అనిల్‌ కుంబ్లే (10) మొదటి స్థానంలో ఉన్నాడు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img