Friday, April 26, 2024
Friday, April 26, 2024

తొలిరోజు ఆసీస్‌దే ఆధిపత్యం

. 109 పరుగులకే కుప్పకూలిన టీమిండియా
. 47 పరుగుల ఆధిక్యం సాధించిన ఆస్ట్రేలియా

ఇండోర్‌ : బోర్డర్‌`గవాస్కర్‌ ట్రోఫీలో భాగంగా టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్టులో తొలి రోజు ఆస్ట్రేలియా ఆధిపత్యం సాగింది. ఒకటిన్నర సెషన్లలోనే టీమిండి యాను ఆలౌట్‌ చేసిన ఆస్ట్రేలియా… ఆ తర్వాత రెండు సెషన్లలో బ్యాటుతోనూ ఆధిపత్యాన్ని చూపించింది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 54 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది ఆస్ట్రేలియా. ఫలితంగా ఇప్పటికే 47 పరుగుల ఆధిక్యం సంపాదిం చింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖవాజా (60) రాణించాడు. టాప్‌ ఆర్డర్‌ బ్యాటర్‌లు మార్నస్‌ లబుషగ్నే (31), స్టీవ్‌ స్మిత్‌ (26) కూడా పర్వా లేదనిపించారు. మరో ఓపెనర్‌ ట్రావిస్‌ హెడ్‌ (9) విఫల మయ్యాడు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా జోరు కొనసాగుతోంది. రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా ఏడు వికెట్లు తీసిన జడేజా… మూడో టెస్టు తొలి ఇన్నిం గ్స్‌లో నాలుగు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అంతకుముందు టీమిండియా బ్యాటర్లు ఆసీస్‌ స్పిన్నర్లకు దాసోహం అన్నట్లుగా వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. విరాట్‌ కోహ్లీ (22), శుభ్‌మన్‌ గిల్‌ (21), ఉమేశ్‌ యాదవ్‌ (17) శ్రీకర్‌ భరత్‌ (17), అక్షర్‌ పటేల్‌ (12), రోహిత్‌ శర్మ (12) మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. మిగిలినవారంతా ఒక అంకె స్కోరుకే పరిమితమయ్యారు. దాంతో టీమిండియా 109 పరుగు లకే ఆలౌట్‌ అయ్యింది. ఆసీస్‌ బౌలర్లలో మాథ్యూ కుహ్నెమాన్‌ 5, నాథన్‌ లియాన్‌ 3 వికెట్లు తీశారు. టాడ్‌ మర్ఫీకి ఒక వికెట్‌ దక్కింది. టీమిండియాను కేవలం 33.2 ఓవర్లలోనే ఆలౌట్‌ చేసినప్పటికీ ఆసీస్‌కి శుభారంభం దక్కలేదు. ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లో ట్రావిస్‌ హెడ్‌ని జడేజా ఎల్బీడబ్ల్యూగా అవుట్‌ చేశాడు. అంపైర్‌ నాటౌట్‌గా ప్రకటించినా డీఆర్‌ఎస్‌ తీసుకున్న టీమిండి యాకి ఫలితం దక్కింది. ఆ తర్వాతి ఓవర్‌లో మార్నస్‌ లబుషేన్‌ని జడేజా క్లీన్‌ బౌల్డ్‌ చేసినప్పటికీ అది నో బాల్‌గా తేలడంతో లబుషేన్‌ నాటౌట్‌గా తేలాడు. ఆ తర్వాత ఉస్మాన్‌ ఖవాజా కోసం రెండు సార్లు రివ్యూ తీసు కుని, ఫలితం రాబట్టలేకపోయింది టీమిండియా. రెండు డీఆర్‌ఎస్‌ రివ్యూలు వృథా కావడంతో ఆ తర్వాత టీమిం డియా జాగ్రత్త పడిరది. ఇది ఆస్ట్రేలియాకి కలిసి వచ్చింది. లబుషేన్‌ 7 పరుగుల వద్ద ఉన్నప్పుడు అశ్విన్‌ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూకి అప్పీలు చేయగా, అంపైర్‌ నాటౌట్‌గా ప్రకటించాడు. ఒకే రివ్యూ మిగలడంతో కెప్టెన్‌ రోహిత్‌ డీఆర్‌ఎస్‌ తీసుకోలేదు. అయితే టీవీ రీప్లేలో బంతి వికెట్లను తాకుతుందని స్పష్టంగా కనిపించింది. 102 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న ఉస్మాన్‌ ఖవాజాతో కలిసి లబుషేన్‌ రెండో వికెట్‌కి 96 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అదృష్టం కలిసి రావడంతో మూడు సార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించు కున్న లబుషేన్‌ (31) రవీంద్ర జడేజా బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. 147 బంతుల్లో 4 ఫోర్లతో 60 పరు గులు చేసిన ఉస్మాన్‌ ఖవాజా కూడా రవీంద్ర జడేజా బౌలింగ్‌లో శుబ్‌మన్‌ గిల్‌కి క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు. 38 బంతుల్లో 4 ఫోర్లతో 26 పరుగులు చేసిన స్టీవ్‌ స్మిత్‌ కూడా జడేజా బౌలింగ్‌లోనే అవుట్‌ అయ్యాడు. ఆస్ట్రేలియా కోల్పోయిన 4 వికెట్లను రవీంద్ర జడేజానే పడగొట్టడం విశేషం. అయితే ట్రావిస్‌ హెడ్‌ని అంపైర్‌ నాటౌట్‌గా ప్రకటించినా డీఆర్‌ఎస్‌ తీసుకుని వికెట్‌ సాధించిన రవీంద్ర జడేజా, ఆ తర్వాత లబుషేన్‌ కోసం రెండు సార్లు, స్మిత్‌ కోసం ఓసారి డీఆర్‌ఎస్‌ రివ్యూలు తీసుకుని వాటిని వృథా చేశాడు. తొలి 40 ఓవర్లలో 3 డీఆర్‌ఎస్‌ రివ్యూలను కోల్పోయింది టీమిండియా.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img