Friday, April 26, 2024
Friday, April 26, 2024

నాగ్‌పూర్‌ టెస్టు మనదే

. ఆసీస్‌పై టీమిండియా ఘన విజయం
. 91కే కుప్పకూలిన చేతులెత్తేసిన కంగారూలు
. ఐదు వికెట్లతో అల్లాడిరచిన అశ్విన్‌

నాగపూర్‌: బోర్డర్‌ – గవాస్కర్‌ ట్రోఫీ నాలుగు టెస్టుల సిరీస్‌లో భారత్‌ బోణీ కొట్టింది. స్పిన్‌ కు అనుకూలిస్తున్న నాగ్‌పూర్‌ పిచ్‌ పై భారత స్పిన్‌ త్రయం రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌ లు ఆసీస్‌కు చుక్కలు చూపించారు. స్పిన్‌ ఉచ్చులో పడ్డ కంగారూలు చేతులెత్తేయడంతో టీమిం డియా తొలి టెస్టులో ఇన్నింగ్స్‌ 132 పరుగుల తేడాతో ఘన విజయం అందుకుంది. మూడు రోజుల్లోనే టెస్టును ముగించింది. మూడవ రోజు శనివారం బ్యాటింగ్‌ కొనసాగించిన టీమిండియా… 400 పరుగులకు ఆలౌట్‌ అయింది. తొలి ఇన్నింగ్స్‌ లో 223 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. అయితే రెండవ ఇన్నింగ్స్‌లో ఆసీస్‌… 91 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా నాలుగు టెస్టుల సిరీస్‌ లో భారత్‌ 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో ఇన్నిం గ్స్‌లో అశ్విన్‌ ఆసీస్‌ పతనాన్ని శాసిం చాడు. స్పిన్‌ కు అనుకూలిస్తున్న పిచ్‌ పై రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ కు వచ్చిన ఆసీస్‌… రెండో ఓవర్లోనే తొలి వికెట్‌ ను కోల్పోయింది. అశ్విన్‌ వేసిన రెండో ఓవర్లో ఉస్మాన్‌ ఖవాజా (5) ఔట య్యాడు. ఖవాజా ఇచ్చిన క్యాచ్‌ ను స్లిప్స్‌ లో కోహ్లీ అందుకున్నాడు. వన్‌ డౌన్‌ లో వచ్చిన లబూషేన్‌ (17) మూడు ఫోర్లు కొట్టి జోరందుకున్నట్లు కనిపించినా జడేజా వేసిన 11వ ఓవర్‌ లో ఐదో బంతికి ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. ఆ తర్వాత డేవిడ్‌ వార్నర్‌… అశ్విన్‌ వేసిన 14వ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టినప్పటికీ ఐదో బంతికి వికెట్ల ముందు దొరికిపోయాడు. 15 ఓవర్లు కూడా ముగియకముందే ఆసీస్‌.. 35 పరుగులకే మూడు కీలక వికెట్లను కోల్పోయింది. వార్నర్‌ స్థానంలో క్రీజులోకి వచ్చిన మాథ్యూ రెన్షా (2) కూడా తన సహచరుడినే అనుసరించాడు. అశ్విన్‌ బౌలింగ్‌లో రెన్షా ఎల్బీ రూపంలో పెవిలి యన్‌ చేరాడు. అతడి స్థానంలో వచ్చిన హ్యాండ్స్‌కాంబ్‌ (6) కూడా అశ్విన్‌ బౌలింగ్‌ లోనే బలయ్యాడు. వికెట్‌ కీపర్‌ అలెక్స్‌ క్యారీ (10)ని కూడా అశ్విన్‌.. 19వ ఓవర్లో ఎల్బీగా ఔట్‌ చేశాడు. అశ్విన్‌ మొత్తం ఐదు వికెట్లు పడగొ ట్టాడు. ఆ తర్వాత వచ్చిన ఆస్ట్రేలియా సారథి పాట్‌ కమిన్స్‌ (10) కూడా వెంటనే ఔట్‌ అయ్యాడు. రవీంద్ర జడేజా వేసిన 23వ ఓవర్‌ నాలుగో బంతి కమిన్స్‌ బ్యాట్‌ ను తాకుతూ వెళ్లి వికెట్‌ కీపర్‌ శ్రీకర్‌ భరత్‌ చేతుల్లో పడిరది. అనంతరం మర్ఫీ (2).. అక్షర్‌ పటేల్‌ వేసిన 26వ ఓవర్లో మూడో బంతికి రోహిత్‌ శర్మ కు క్యాచ్‌ ఇచ్చాడు. నాథన్‌ లియాన్‌ (8), స్కాట్‌ బొలాండ్‌ లను షమీ ఔట్‌ చేసి ఆసీస్‌ ఇన్నింగ్స్‌ కు తెరదించాడు. ఒక్క సెషన్‌ కూడా పూర్తిగా ఆడక ముందే ఆసీస్‌ ఇన్నింగ్స్‌ ముగిసిపోయింది. అంతకు ముందు మూడోరోజు ఉదయపు సెషన్‌ లో భారత్‌ ఓవర్‌ నైట్‌ స్కోరు (321) కి మరో 71 పరుగులు జోడిరచిన టీమిండియా… 400 పరుగుల వద్ద ఆలౌట్‌ అయింది. అక్షర్‌ పటేల్‌ (84) సెంచరీ మిస్‌ చేసుకున్నాడు. షమీ (37) రాణించాడు. ఆసీస్‌ బౌలర్లలో టాడ్‌ మర్ఫీ ఏడు వికెట్లు పడగొట్టగా, కమిన్స్‌ కు రెండు, లియాన్‌ కు ఒక వికెట్‌ దక్కింది. తొలి టెస్టులో దారుణంగా ఓడిన ఆస్ట్రేలియా భారత గడ్డపై ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఒక ఇన్నింగ్స్‌లో 91 పరుగులకే ఆలౌట్‌ కావడం… భారత గడ్డపై ఆస్ట్రేలియాకు ఇదే అత్యల్ప స్కోరు.
సంక్షిప్త స్కోర్లు : ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ : 177 ఆలౌట్‌, భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ : 400 ఆలౌట్‌, ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ : 91 ఆలౌట్‌, ఫలితం : ఇన్నింగ్స్‌ 132 పరుగుల తేడాతో భారత్‌ ఘన విజయం

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img