Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

లవ్లీనా పంచ్‌

69 కేజీల విభాగంలో దేశానికి కాంస్య పతకం

టోక్యో : భారత మహిళా బాక్సర్‌ లవ్లీనా బొర్గొహెయిన్‌ చరిత్ర సృష్టించింది. ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్‌లో బ్రాంజ్‌ మెడల్‌ సాధించిన లవ్లీనా.. ఈ ఘనతను అందుకున్న మూడో భారత బాక్సర్‌గా నిలిచింది. బుధవారం జరిగిన మహిళల వెల్టర్‌ వెయిట్‌(64-69 కేజీలు) సెమీఫైనల్లో లవ్లీనా 0-5 తేడాతో టర్కీ బాక్సర్‌, వరల్డ్‌ చాంపియన్‌ సుర్మెనెలి బుసెనాజ్‌ చేతిలో ఓటమిపాలైంది. దాంతో లవ్లీనా కాంస్య పతకానికే పరిమితమైంది. బాక్సింగ్‌లో సెమీఫైనల్లో ఓడిన ఇద్దరికి బ్రాంజ్‌ మెడల్స్‌ అందిస్తారన్న విషయం తెలిసిందే. లవ్లీనాకు దక్కింది బ్రాంజ్‌ మెడలే అయినా అది గోల్డ్‌తో సమానమే! ఎందుకంటే భారత బాక్సింగ్‌కు 12 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో ఆమె తొలి పతకం అందిస్తోంది. అంతేకాకుండా తన అరంగేట్ర ఒలింపిక్స్‌లోనే పతకం సాధించి మువ్వన్నెల జెండా రెపరెపలాడిరచింది. అంతర్జాతీయ బాక్సింగ్‌లో అంతగా అనుభవం లేని లవ్లీనాకు సెమీస్‌ పోరు అంత సలువు కాదని అందరికీ తెలుసు. ప్రత్యర్థి టర్కీ బాక్సర్‌ సుర్మెనెలి బుసెనాజ్‌ వరల్డ్‌ చాంపియన్‌. ఈ ఏడాది ఆమె రెండు అంతర్జాతీయ పోటీల్లో స్వర్ణాలు గెలిచి మంచి ఫామ్‌లో ఉంది. గతంలో మిడిల్‌ వెయిట్‌ (75 కిలోలు) ఆడిన ఆమె ఈ సారి 69కిలోల విభాగంలో తలపడిరది. ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో 16 సార్లు పతకాలు కొల్లగొట్టింది. పిడిగుద్దులు, హుక్స్‌, బాడీ షాట్స్‌తో విరుచుకుపడే సుర్మెనెలిపై లవ్లీనా స్ఫూర్తిదాయకంగా పోరాడిరది. తొలి రౌండ్‌లో లవ్లీనా కొన్ని పంచులు బాగానే విసిరింది. వాటిని ప్రత్యర్థి తన డిఫెన్స్‌తో అడ్డుకొంది. దాంతో 50-45తో సుర్మెనెలి మొదటి రౌండ్‌ గెలుచుకుంది. ఇక రెండో రౌండ్లో ఆమె మరింత రెచ్చిపోగా లవ్లీనా రక్షణాత్మక ధోరణి కనబరిచింది. ఇక చివరి రౌండ్లో ఆమె మరింత తేలిపోయింది. ఆఖరికి 30-26, 30-26, 30-25, 20-25, 30-25 టర్కీ బాక్సర్‌ ఘన విజయం అందుకుంది. ఇక ఒలింపిక్‌ క్రీడల్లో బాక్సింగ్‌ విభాగంలో భారత్‌కు ఇది మూడో మెడల్‌. అంతకుముందు 2008లో విజేందర్‌ సింగ్‌, 2012లో మేరీకోమ్‌ ఒలింపిక్‌ పతకాన్ని ముద్దాడారు. అయితే వారిద్దరికీ కాంస్య పతకాలే దక్కాయి. 69 కేజీల విభాగంలో తొలి పతకం అందిస్తున్నది మాత్రం లవ్లీనానే. ఆమె గతంలో వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో రెండుసార్లు కాంస్య పతకాలు గెలిచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img