Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

లార్డ్స్‌లో విజయం ఎంతో ప్రత్యేకం : కోహ్లీ

లార్డ్స్‌ : క్రికెట్‌ పుట్టినిల్లు లార్డ్స్‌లో జరిగిన టెస్ట్‌మ్యాచ్‌లో సాధించిన ఉత్కంఠభరిత విజయం ఎంతో ప్రత్యేకమైనదని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అన్నాడు. రెండో టెస్టులో జట్టు ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేసిన కోహ్లీ.. జట్టును చూసి గర్వపడుతున్నాని మ్యాచ్‌ అనంతరం జరిగిన కార్యక్రమంలో వెల్లడిరచాడు.
ఇంగ్లాండ్‌ ఆటగాళ్లతో జరిగిన వాగ్వాదం.. బౌలర్లు షమీ, బూమ్రాలకు భారత్‌ను విజయతీరాలకు చేర్చేలా ప్రేరేపించిందని కోహ్లీ అన్నాడు. ‘2014లో ఎంఎస్‌ ధోనీ సారథ్యంలో లార్డ్స్‌లో భారత్‌ సాధించిన గెలుపు కన్నా.. ఈ విజయం మాకెంతో ప్రత్యేకమైనది.. 60 ఓవర్లలో మ్యాచ్‌ ఫలితం రాబట్టాలనే లక్ష్యం పెట్టుకోవడమే అందుకు కారణం.. జట్టును చూసి గర్వపడుతున్నా’’ అని కోహ్లీ చెప్పాడు.
వాగ్వాదాలను పట్టించుకోము..
ఆట మధ్యలో ప్రత్యర్థులు కవ్వింపులకు పాల్పడటం, వాగ్వాదాలు వంటివి జరిగినా అవి తాము పట్టించుకోమని అన్నాడు టీమిండియా ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ అన్నాడు. ప్రత్యర్థి.. తన జట్టు సభ్యుల్లో ఎవరినైనా స్లెడ్జ్‌ చేస్తే అందరం కలిసి బుద్ధి చెప్తామని రాహుల్‌ తెలిపాడు.
అద్భుత విజయం
ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా అద్భు తం చేసింది. చివరిరోజు పేసర్లు మాయ చేశారు. డ్రా దిశగా సాగుతున్న మ్యాచ్‌ను ఒక్కసారిగా టీమిండియాకు అను కూలంగా మార్చేశారు. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ను 120 పరుగులకే పరిమితం చేసి 151 పరుగుల ఘన విజయం అందించారు. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌లో టీమిండియా 1`0 ఆధిక్యం సంపాదించింది. రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీసేన నిర్దేశించిన 272 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ చేతులెత్తేశారు. సిరాజ్‌ 4/32, బుమ్రా 3/33, ఇషాంత్‌ 2/13 ధాటికి నిలవలేకపోయారు. కెప్టెన్‌ జోరూట్‌(33 60 బంతుల్లో) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. చివర్లో బట్లర్‌(25Ñ 96 బంతుల్లో), రాబిన్‌సన్‌(9 Ñ 35 బంతుల్లో) వికెట్‌ కాపాడుకునే ప్రయత్నం చేసినా బుమ్రా, సిరాజ్‌ అడ్డుకట్ట వేశారు. అంతకుముందు టీమిండియా 181/6 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో సోమవారం ఐదోరోజు ఆటను ప్రారంభించగా.. మహ్మద్‌ షమి (56 నాటౌట్‌ 70 బంతుల్లో 6I4, 1I6), జస్ప్రిత్‌ బుమ్రా (34 నాటౌట్‌ 64 బంతుల్లో 3I4) బ్యాటింగ్‌లోనూ అద్భుతం చేశారు. వీరిద్దరూ ఎనిమిదో వికెట్‌కు 89 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. దాంతో తొలి సెషన్‌లో భారత్‌ను ఆలౌట్‌ చేసి మ్యాచ్‌పై పట్టు సాధించాలను కున్న ఇంగ్లాండ్‌ వ్యూహం ఫలించలేదు. జట్టు స్కోర్‌ 298/8 పరుగుల వద్ద టీమిండియా ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. ఆపై లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లాండ్‌ తొలి ఓవర్‌ నుంచే వికెట్లు కోల్పోయింది. భారత పేసర్లు వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ ఇంగ్లాండ్‌పై ఒత్తిడి పెంచారు. ఈ క్రమంలోనే చివరికి అద్భుత విజయం సాధించారు. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా భారత్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 128 పరుగులు చేసి న కేఎల్‌ రాహుల్‌ ఎంపికయ్యాడు. టీమిండియా విజయంపై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img