Friday, April 26, 2024
Friday, April 26, 2024

హాకీలో గెలుపు…క్రికెట్‌లో ఓటమి

వివిధ క్రీడాంశాల్లో రాణించిన భారత్‌

బర్మింగ్‌హామ్‌(ఇంగ్లండ్‌): కామన్వెల్త్‌ గేమ్స్‌లో తొలి రోజు ఒక్క పతకం కూడా దక్కకపోయినప్పటికీ భారత క్రీడాకారులు వివిధ క్రీడాంశాల్లో మంచి విజయాలు నమోదు చేశారు. మిక్స్‌డ్‌ టీం గ్రూప్‌-ఎ బ్యాడ్మింటన్‌ మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పీవీ సింధు 3-0తో విజయం సాధించింది. కిడాంబి శ్రీకాంత్‌, మిక్స్‌డ్‌ డబుల్స్‌ జట్టు తమ మ్యాచ్‌లను గెలిచి ఇండియాను 2-0 ఆధిక్యంలో తీసుకెళ్లారు. ఇక ఘనాతో జరిగిన హాకీ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు సంపూర్ణ ఆధిపత్యం సాధించి 5-0తో విజయం సాధించింది. అలాగే, 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌ స్విమ్మింగ్‌లో శ్రీహరి నటరాజ్‌ సెమీస్‌కు అర్హత సాధించాడు. ఇండియన్‌ బాక్సర్‌ శివ థాపా 63 కేజీల విభాగంలో పాకిస్థాన్‌ బాక్సర్‌ సులేమాన్‌ బలోచ్‌ను 5-0తో విజయం సాధించారు. భారత మహిళల టీటీ జట్టు గ్రూప్‌ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను 3-0తో ఓడిరచింది. శ్రీజ ఆకుల-రీత్‌ టెన్నిసన్‌తో కూడిన డబుల్స్‌ జట్టు లైలా ఎడ్వర్డ్స్‌-డేనిషా జయవంత్‌ పటేల్‌తో కూడిన జట్టును వరుస సెట్లలో ఓడిరచింది. శ్రీజ అకుల, రీత్‌ టెన్నిసన్‌ డబుల్స్‌ జట్టు… లైలా ఎడ్వర్డ్స్‌, డానీషా జయవంత్‌ పటేల్‌లను వరుస గేమ్‌లలో ఓడిరచింది. స్టార్‌ టీటీ ప్లేయర్‌ మనీకా బాత్రా… ముష్ఫిక్‌ కలామ్‌ను 11-5, 11-3, 11-2తో మట్టికరిపించింది. ఆ తర్వాత డేనిష్‌ జయవంత్‌ను శ్రీజ ఆకుల ఓడిరచింది. అయితే భారత్‌కు తొలి రోజు కొన్ని పరాజయాలు కూడా తప్పలేదు. స్విమ్మింగ్‌ (50 మీటర్ల బటర్‌ఫ్లై, 400 మీటర్ల ఫ్రీ స్టైల్‌), సైక్లింగ్‌ ఈవెంట్స్‌లో పరాజయాలు మూటగట్టుకుంది. ఇక మహిళల టీ20 తొలి మ్యాచ్‌లో భారత్‌ జట్టు పరాజయాన్ని చవిచూసింది. మూడు వికెట్ల తేడాతో ఆసీస్‌ జట్టు విజయం సాధించింది. 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌ అదరగొట్టింది. బ్యాటర్‌ ఆష్లే గార్డనర్‌(52) అద్భుత అర్ధశతకంతో ఆకట్టుకోగా.. మరో బ్యాటర్‌ గ్రేస్‌ హ్యారిస్‌(37) రాణించింది. భారత బౌలర్లలో రేణుకా సింగ్‌ 4 వికెట్లు తీయగా, మేఘనా సింగ్‌`1, దీప్తి శర్మ రెండు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు, టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ మహిళల జట్టు, ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌(52) అర్ధశతకంతో ఆకట్టుకోగా.. షెఫాలీ వర్మ(48) రాణించింది. వీరిద్దరూ మినహా మిగిలిన వారు విఫలమయ్యారు. ఆసీస్‌ బౌలర్లలో జెస్‌ జొనాసెన్‌ 4 వికెట్లతో మెరుగైన ప్రదర్శన చేసింది. మెగాన్‌ స్కూఫ్‌ రెండు వికెట్లు తీయగా.. డార్సీ బ్రౌన్‌ ఓ వికెట్‌ తన ఖాతాలో వేసుకుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img