Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

అంతర్జాతీయ క్రికెట్‌కు హేల్స్‌ వీడ్కోలు

లండన్‌: ఇంగ్లండ్‌ విధ్వంసక ఓపెనర్‌ అలెక్స్‌ హేల్స్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. టీ20 స్పెషలిస్ట్‌గా పేరొందిన అతను మూడు ఫార్మాట్లకు ముగింపు పలికాడు. దాంతో, అతడి 12 ఏళ్ల కెరీర్‌ ముగిసింది. అలెక్స్‌ ఇకపై ఫ్రాంచైజ్‌ క్రికెట్‌లో సత్తా చాటాలని భావిస్తున్నాడు. నిరుడు టీ20 వరల్డ్‌ కప్‌గెలిచిన ఇంగ్లండ్‌ జట్టులో అలెక్స్‌ సభ్యుడు. విధ్వంసక ఆటగాడిగా పేరొందిన అలెక్స్‌ హేల్స్‌ 2011లో భారత్‌పై టీ20ల్లో అరంగేట్రం చేశాడు. పొట్టి క్రికెట్‌లో సంచలన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న అలెక్స్‌ ఆ తర్వాత వన్డే జట్టులోకి వచ్చాడు. అయితే.. టీ20ల్లోనే బాగా సక్సెస్‌ అయ్యాడు. కొన్ని రోజులు ఈ ఫార్మాట్‌లో వరల్డ్‌ నంబర్‌ 1 బ్యాటర్‌గా కొనసాగాడు. ఇంగ్లండ్‌ జట్టు వన్డేల్లో నమోదుచేసిన రెండు అత్యధిక స్కోర్లలో అలెక్స్‌ పాత్ర ఉంది. 2022లో పాకిస్తాన్‌పై సెంచరీ(171)తో కదం తొక్కాడు. 2018లో ఆస్ట్రేలియాపై 147 పరుగులతో అదరగొట్టాడు. దాంతో, ఇంగ్లండ్‌ 498 పరుగుల భారీ స్కోర్‌ చేసింది.
ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇచ్చిన 2022 టీ20 వరల్డ్‌ కప్‌లో జోస్‌ బట్లర్‌ సేన ఫైనల్‌కు దూసుకెళ్లంలో అలెక్స్‌ కీలక పాత్ర పోషించాడు. భారత జట్టుతో జరిగిన సెమీఫైనల్లో ఈ చిచ్చర పిడుగు 86 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇప్పటివరకూ ఇంగ్లండ్‌ తరపున అలెక్స్‌ 75 టీ20లు, 70 వన్డేలు, 11 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. జాతీయ జట్టుకంటే ఫ్రాంచైజీ క్రికెట్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవాడు. ఈ ఏడాది ఆరంభంలో పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లో ఆడడం కోసం అతను బంగ్లాదేశ్‌ పర్యటన నుంచి తప్పుకున్నాడు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img