Friday, May 3, 2024
Friday, May 3, 2024

ప్రపంచకప్‌ జట్టులోకి తిలక్‌వర్మను తీసుకోవాలి: ఎమ్మెస్కే

న్యూదిల్లీ: వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌ లో తెలుగు తేజం తిలక్‌ వర్మ అదరగొడు తున్నాడు. అరంగేట్రం సిరీస్‌లోనే అద్భుత బ్యాటింగ్‌తో ఔరా అనిపిస్తున్నాడు. దాంతో… ఈసారి వన్డే ప్రపంచకప్‌ జట్టుకు అతడిని ఎంపిక చేయాలని డిమాండ్‌ చేస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా టీమిండియా మాజీ చీఫ్‌ సెలెక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. ప్రపంచ కప్‌ జట్టులో తిలక్‌ వర్మను తీసుకోవాలని, అతడు జట్టుకు వైవిధ్యాన్ని తీసుకొస్తాడని అన్నాడు. ‘టాపార్డర్‌లో ఈ లెఫ్ట్‌ హ్యాండర్‌ చక్కగా సరిపోతాడు. చాలా కొద్దిమంది మాత్రమే విభిన్న పరిస్థితులకు అలవాటు పడతారు. వాళ్లలో తిలక్‌ వర్మ ఒకడు. ఒకవేళ శ్రేయాస్‌ అయ్యర్‌ ఫిట్‌గా లేకుంటే అతడి స్థానంలో తిలక్‌ను ఆడిరచాలి. ఎందుకంటే..? ఈ తెలుగు కుర్రాడు ఫాస్ట్‌ బౌలర్లతో పాటు స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కొంటాడు. అంతేకాదు అవసరాన్ని బట్టి గేర్‌ మార్చి విరుచుకుపడగల నైపుణ్యం అతడి సొంతం. ఏ రకంగా చూసినా తిలక్‌ వరల్డ్‌ కప్‌లో ఆడేందుకు అన్ని విధాలా అర్హుడు’ అని ప్రసాద్‌ వెల్లడిరచాడు. ఇంతేగాకుండా తిలక్‌ స్ట్రయిక్‌ రొటేట్‌ చేసే విధానం గమినిస్తే తనకు ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు, వన్డేల స్పెషలిస్టు మైఖేల్‌ బెవాన్‌ గుర్తుకొస్తున్నాడని ప్రసాద్‌ అన్నాడు. ‘తిలక్‌ పరిస్థితుల్ని త్వరగా అర్థం చేసుకుంటాడు. చకచకా స్ట్రయిక్‌ రొటేట్‌ చేస్తాడు. దాంతో, అతడిని పరుగులు చేయకుండా ఆపడం కష్టం. అతడి ఆట మైఖేల్‌ బెవాన్‌ను పోలి ఉంటుంది. పైగా దేశవాళీ క్రికెట్‌లో తిలక్‌ వర్మ సగటు 55 ఉంది. అందుకని అతను వరల్డ్‌ కప్‌ జట్టు ఎంపికలో మిగతావాళ్లకంటే బెస్ట్‌ చాయిస్‌ అవుతాడు’ అని ఎమ్మెస్కె చెప్పు కొచ్చాడు. ఐపీఎల్‌ 16వ సీజన్‌లో రాణించిన తిలక్‌ వర్మ జాతీయ జట్టులోకి వచ్చాడు. వెస్టిండీస్‌పై టీ20ల్లో అరంగేట్రం చేసిన ఈ యువ కిశోరం… మొదటి మ్యాచ్‌లో 39, రెండో మ్యాచ్‌లో (51) అర్ధ సెంచరీతో మెరిశాడు.
కీలకమైన మూడో మ్యాచ్‌లో 49 నాటౌట్‌తో జట్టును విజయ తీరాలకు చేర్చాడు. దాంతో, ఐదు టీ20ల సిరీస్‌లో భారత్‌ తొలి విజయం నమోదు చేసింది. ఇరుజట్ల మధ్య నాలుగో టీ20 ఆగస్టు 12న జరుగనుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img