Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

బుమ్రా లేకుంటే టీమిండియాకు గడ్డు పరిస్థితే!

న్యూదిల్లీ:
టీమిండియాకు ఫాస్ట్‌బౌలర్‌ జస్ప్రిత్‌ బుమ్రా అత్యంత కీలక ఆటగాడని భారత మాజీ బ్యాటర్‌ మహ్మద్‌ కైఫ్‌ అభిప్రాయపడ్డాడు. అతను భారత జట్టుకు ఆడకపోతే 2022లో జరిగిన ఆసియా కప్‌, టీ20 ప్రపంచకప్‌లో ఏం జరిగిందో రానున్న ప్రపంచకప్‌లో అదే జరుగుతుంద న్నాడు. ఆసియా కప్‌లో భారత జట్టు సూపర్‌ ఫోర్‌లో వెనుదిరుగగా.. టీ20 ప్రపంచ కప్‌లో సెమీస్‌ ఫైనల్‌లో ఇంగ్లండ్‌ చేతిలో 10 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. భారత్‌కు రెండుమూడు జట్లను దించే సత్తా ఉందని, అయితే బౌలింగ్‌లో అంత డెప్త్‌ లేదని కైఫ్‌ పేర్కొన్నాడు. ప్రస్తుతం గాయపడ్డ వారంతా ప్రపంచకప్‌లో భారతకు కీలకమైన ఆటగాళ్లని కైఫ్‌ తెలిపాడు. బుమ్రా పునరాగమనంపైనే టీమిండియా ఆశలున్నాయని, చాలాకాలం తర్వాత బుమ్రా మళ్లి జట్టులోకి వస్తుండగా… ఎంత ఫిట్‌గా ఉన్నాడో బరిలోకి దిగితే గానీ తెలియదు. స్వదేశంలో జరిగే ప్రపంచకప్‌లో రాణించాలంటే భారత్‌కు పూర్తి ఫిట్‌గా ఉన్న బుమ్రా అవసరమని కైఫ్‌ పేర్కొ న్నారు. బుమ్రా వరల్డ్‌కప్‌ ఆడకపోతే ఈ టోర్నీలో టీమిండియా ఓటమిపాలయ్యే ఛాన్స్‌ ఉంటుందని, 2022 ఆసియాకప్‌, టీ20 వరల్డ్‌ కప్‌ ఫలితమే పునరావృతమవుతుందని పేర్కొన్నారు. బుమ్రా స్థానంలో బ్యాకప్‌ లేదని, ప్రస్తుతం భారత జట్టు బలంగా కనిపించడం లేదని కైఫ్‌ పేర్కొన్నాడు. కేఎల్‌ రాహుల్‌, రిషబ్‌ పంత్‌, శ్రేయాస్‌ అయ్యర్‌ వంటి కీలకమైన ఆటగాళ్లు గాయాల కారణంగా జట్టుకు దూరం కావడంతో ప్రస్తుతం టీమిండియా బలహీనంగా కనిపిస్తోందని కైఫ్‌ పేర్కొన్నాడు. అయితే, ప్రపంచకప్‌లోకి రిజర్వ్‌ కీపర్‌గా ఇషాన్‌ కిషన్‌ను తీసుకోవాలని కైఫ్‌ జట్టు మేనేజ్‌మెంట్‌కు సూచించాడు. ఇప్పటి వరకు ఇషాన్‌ ఆటతీరు బాగానే ఉందని చెప్పాడు. ఇషాన్‌, సూర్యకుమార్‌, సంజు శాంసన్‌, శ్రేయాస్‌ అయ్యర్‌లో ఎవరు 15 మంది సభ్యుల ప్రపంచకప్‌ జట్టులో ఉంటారో తెలియనది, కేఎల్‌ రాహుల్‌ ప్రపంచకప్‌ ఆడితే.. బ్యాకప్‌ వికెట్‌ కీపర్‌ ఎవరు చూసుకోవాలని, ఇషాన్‌ కిషన్‌ను బ్యాకప్‌గా తీసుకోవాలని చెప్పాడు. టీమిండియా క్వార్టర్స్‌కు అర్హత సాధిస్తుందని కైఫ్‌ అభిప్రాయపడ్డాడు. సెమీ ఫైనల్‌ నుంచి టీమిండియాకు కష్టంగా సవాల్‌గా ఉంటుందని, ప్రపంచకప్‌ టైటిల్‌ను గెలవాలంటే రెండు కీలకమైన మ్యాచ్‌లను గెలవాల్సి ఉంటుందని కైఫ్‌ అభిప్రాయపడ్డాడు. ఈ నెలలో ఐర్లాండ్‌ భారత జట్టు మూడు మ్యాచుల టీ20 సిరీస్‌ ఆడనున్నది. ఈ సిరీస్‌తో జస్ప్రీత్‌ బుమ్రా జాతీయ జట్టులోకి తిరిగిరానున్నాడు. ఈ సిరీస్‌కు కెప్టెన్‌గా కూడా వ్యవహరించనున్నాడు. దాంతో అందరి దృష్టి బుమ్రాపైనే పడిరది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img