మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ బ్యాడ్మింటన్‌లో భారత స్టార్ షట్లర్లు జోరు కొనసాగిస్తున్నారు. హెచ్‌ఎస్ ప్రణయ్, పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్, ప్రియాన్సు రజావత్ క్వార్టర్స్‌లో అడుగుపెట్టారు. ప్రణయ్ రెండో రౌండ్‌లో చైనీస్ తైపీ ఆటగాడు చి యూ జెన్‌ను చిత్తుగా ఓడిరచాడు. తొలి సెట్ కోల్పోయినా కూడా పట్టుదలతో పోరాడిన ప్రణయ్ చివరి రెండు సెట్లు గెలుచుకున్నాడు. 74 నిమిషాల పాటు నువ్వా నేనా అన్నట్లు జరిగిన మ్యాచ్‌లో 19-21, 21-19, 21-13తో విజయం సాధించి క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. గత ఎనిమిది టోర్నమెంట్‌లలో అతను క్వార్టర్స్ చేరడం ఇది ఆరోసారి. మరో మ్యాచ్‌లో శ్రీకాంత్… చైనీస్ తైపీకి చెందిన సు లీ యాంగ్‌ను ఓడిరచాడు. రజావత్ కూడా చైనీస్ తైపీ ఆటగాడు వాంగ్ జూ వీ ను చిత్తు చేసి క్వార్టర్స్‌కు చేరాడు. ఏడో ర్యాంకర్‌ను చిత్తు చేసిన భారత యువ సంచలనం మిధున్ మంజునాథ్ నిరాశ పరిచాడు. మలేషియా ఆటగాడు లీ జీ జియా చేతిలో అనూహ్యంగా ఓడి, ఇంటిదారి పట్టాడు. సింధు సునాయాసంగా…
ఒలింపిక్ పతక విజేత సింధు భారత్‌కే చెందిన ఆకర్షి కశ్యపను చిత్తు చేసి క్వార్టర్స్ చేరింది. ఈ ఏడాది తొలి టైటిల్ వేటలో ఉన్న సింధు… 21-14, 21-10తో అవలీలగా గెలుపొందింది. తర్వాతి రౌండ్‌లో సింధుకు గట్టి ప్రత్యర్థి ఎదురవనుంది. అమెరికాకు చెందిన నాలుగో సీడ్ బీవెన్ జాంగ్‌తో తలపడనుంది. ఈ సీజన్‌లో క్వార్టర్స్ స్టేజ్ దాటలేకపోయిన సింధు ఈసారైనా ముందడుగు వేస్తుందా? లేదా? అనే ఆసక్తి అందరిలో నెలకొంది.