Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

అత్యంత గొప్ప క్రీడాకారుల్లో కోహ్లీ ఒకడు: డివిలియర్స్‌

ముంబై: భారత స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లీ మైదానంలో చిరుతలా కదులుతాడన్న సంగతి తెలిసిందే. ప్రతిసారీ దూకుడే మంత్రగా ఆడే అతడు… తన 500వ మ్యాచ్‌లో శతకంతో సత్తా చాటాడు. అద్భుత ఇన్నింగ్స్‌తో సెంచరీ కొట్టిన కోహ్లీపై దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌ ఏబీ డివిలియర్స్‌ ప్రశంసలు కురిపించాడు. కోహ్లీ ప్రపంచంలోని గొప్ప క్రీడాకారుల్లో ఒకడని అతను అన్నాడు. గెలవాలన్న కసి… ప్రతిసారి స్కోర్‌ చేయాలనే ఆకలి గొప్ప ఆటగాళ్లలో కనిపించే లక్షణాలని, అవన్నీ విరాట్‌లో పుష్కలంగా ఉన్నాయని డివిలియర్స్‌ తెలిపాడు. ‘గోల్ఫ్‌ దిగ్గజం టైగర్‌ వుడ్స్‌, ఫుట్‌బాల్‌ లెజెండ్స్‌ క్రిస్టియానో రొనాల్డో, లియోనల్‌ మెస్సీ టెన్నిస్‌ ఆల్‌ టైమ్‌ గ్రేట్‌ ప్లేయర్లు రోజర్‌ ఫెదరర్‌, రఫెల్‌ నాదల్‌, నొవాక్‌ జకోవిచ్‌. .. వీళ్లంతా గెలవాలనే కసితో ఆడతారన్నాడు. వీళ్లలో పోరాట స్ఫూర్తి అమోఘం. పోటీ ఏదైనా ప్రతిసారి చాంపియన్‌ అవ్వాలనుకుంటారు. విరాట్‌ కోహ్లీ కూడా అచ్చం వీళ్లలానే ప్రవర్తిస్తాడు. అంతేకాదు అతడి హృదయం చాలా అందమైనదని డివిలియర్స్‌ చెప్పుకొచ్చాడు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img