Saturday, May 18, 2024
Saturday, May 18, 2024

గొడవలు సృష్టిస్తే కేసులు నమోదు చేస్తాం..

వన్ టౌన్ సిఐ సుబ్రహ్మణ్యం, టూ టౌన్ సిఐ. అశోక్ కుమార్
విశాలాంధ్ర ధర్మవరం:: రౌడీ షీటర్లు గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలతో పాటు కేసులు కూడా నమోదు చేస్తామని వన్టౌన్ సిఐ సుబ్రహ్మణ్యం టూ టౌన్ సిఐ అశోక్ కుమార్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయా పోలీస్ స్టేషన్లో రౌడీ శీటర్లను పిలిపించి వారికి తగిన కౌన్సిలింగ్ లు ఇవ్వడం జరిగింది. అనంతరం సిఐలు మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రౌడీ శీటర్లు ఎక్కడైనా, ఏ ప్రాంతంలోనైనా గొడవలు పడిన, గొడవలు సృష్టించిన వారే కారకులు అయిన ఎడల కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రౌడీ శీటర్లపై ఎప్పటికప్పుడు పోలీసులునిగా ఉంటుందని తెలిపారు. రౌడీ శీటర్లగా మీరు ఏం చేస్తున్నారు అనే విషయంపై ప్రత్యేక నిఘా పెట్టడం కూడా జరిగిందని తెలిపారు. పట్టణ పరిధిలోని టీకేఫులు, డాబాలు, హోటల్లో కూడా తనిఖీ చేయడం జరిగిందని తెలిపారు. ఇటువంటి చోట్ల టీ తాగుతూ మాట్లాడుతున్నారని ఎన్నికల సమయంలో ఇలా గుంపులు గుంపులుగా ఉండటం వల్ల రాజకీయంగా గొడవలు జరిగే ప్రమాదం ఉందని తెలిపారు. కావున టీ కేఫ్లలో ఎక్కువ మంది కూర్చోకుండా చూసుకోవాలని ఆ యజమాలను కూడా స్వయంగా హెచ్చరించడం జరిగిందని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img