Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri deneme bonusu bonus veren siteler deneme bonusu veren siteler deneme bonusu veren siteler https://lexilight.com casino siteleri https://www.paletdepom.com.tr
Tuesday, October 1, 2024
Tuesday, October 1, 2024

నాడు – నేడు కు దూరమైన ప్రాథమిక పాఠశాలలు

శిథిలావస్థకు చేరుకున్న వేల్పుమడుగు, ముచ్చురామి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు

సమస్యను వెంటనే పరిష్కరించాలని విద్యాధికారులను ఆదేశించిన మంత్రి
వై.సత్య కుమార్ యాదవ్
విశాలాంధ్ర-ధర్మవరం: నియోజకవర్గ పరిధిలోని బత్తలపల్లి మండలం వేల్పుమడుగు,ధర్మవరం మండలం ముచ్చురామి గ్రామాల్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు శిథిలావస్థలో ఉన్నాయి. మంత్రి వై. సత్య కుమార్ యాదవ్ కార్యాలయ సిబ్బంది శుక్రవారం ఈ పాఠశాలలను పరిశీలించగా అక్కడ నెలకొన్న సమస్యలు వెలుగులోకి వచ్చాయి.
ఈ పాఠశాలలు గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాడు – నేడు పథకం పరిధిలోకి చేర్చకపోవడంతో పూర్తిగా శిథిలావస్థకు చేరుకొని ప్రమాదకరంగా మారాయి. బత్తలపల్లి మండలం వేల్పుమడుగు గ్రామంలోని పాఠశాల పరిస్థితి మరీ దారుణంగా ఉంది .
వర్షాకాలంలో తరగతి గది లోకి నీరు కారుతుండడంతో అక్కడి ఉపాధ్యాయులు సొంత నిధులతో టార్పాలిన్ ను కప్పి తాత్కాలికంగా నీరు కారకుండా చూస్తున్నారు.అలాగే ఆ పాఠశాలలోనే పక్కనే పూర్తిగా శిథిలావస్థలో ఉన్నటువంటి గదిని నామమాత్రముకై మార్పులు చేర్పులు చేసి వదిలేశారు.ఆ పాఠశాలకు చుట్టూ కాంపౌండ్ కూడా సరిగ్గా లేకపోవడంతో పాఠశాలలోకి పశువులు వస్తూ విద్యార్థులకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. ధర్మవరం మండలం ముచ్చురామి గ్రామంలో ఉన్నటువంటి పాఠశాల కూడా పూర్తిగా శిథిలావస్థకు చేరుకుని ఉంది. ఈ తరగతి గదులు ఏ క్షణాన కూలిపోతాయోనని విద్యార్థులు భయాందోళనలలో ఉన్నారు.ఈ విషయాన్ని భారతీయ జనతా పార్టీ కార్యాలయ సిబ్బంది మంత్రి వై. సత్య కుమార్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన సంబంధిత విద్యాధికారులతో మాట్లాడి పాఠశాల గదులకు సంబంధించిన సమస్యను పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img