Monday, April 22, 2024
Monday, April 22, 2024

పాఠశాలలో సంక్రాంతి సంబరాలు

విశాలాంధ్ర ధర్మవరం::(శ్రీ సత్యసాయి జిల్లా) పట్టణంలోని సాయి నగర్ లో గల సూర్య హైస్కూల్లో సంక్రాంతి సంబరాలను హెచ్ఎం నరేంద్రబాబు ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు విద్యార్థుల నడుమ ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ముగ్గుల పోటీలను నిర్వహించారు. ముగ్గులు పోటీల్లో విజేతలైన వారికి స్పందన ఆసుపత్రి వ్యవస్థాపకులు డాక్టర్ బషీర్ హోమియోపతి వైద్యులు ఆదిశేషు, చేతులు మీదుగా బహుమతులను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ ప్రాముఖ్యతను విద్యార్థులకు వారు తెలియజేశారు. సంక్రాంతి పండుగను దేశవ్యాప్తంగా జరుపుకుంటారని, ఉమ్మడి కుటుంబాలలో ఇది ఎక్కువగా జరుగుతుందని తెలిపారు. విద్యార్థినీలు వేసిన ముగ్గులు అందరిని ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రవికుమార్,శ్రీనివాసులు, ప్రభావతి, కళావతి, పోతులయ్య, సునీత, జ్యోతి, హేమ, భాషాలతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img