Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri deneme bonusu bonus veren siteler deneme bonusu veren siteler deneme bonusu veren siteler https://lexilight.com casino siteleri https://www.paletdepom.com.tr
Tuesday, October 1, 2024
Tuesday, October 1, 2024

ఎన్డీఏ కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రం తప్పక అభివృద్ధి చెందుతుంది…

జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి

విశాలాంధ్ర ధర్మవరం:: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్డీఏ కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి తప్పక చెందుతుందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు జనసేన పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ లోని జనసేన నాయకులు కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం చేసిన ప్రజా వ్యతిరేక పాలన వల్ల రాష్ట్ర ప్రజలు విసిగిపోయి వజ్రాయుధం లాంటి ఓటు ద్వారా బుద్ధి చెప్పి కూటమి ప్రభుత్వాన్ని అఖండ మెజారిటీతో గెలిపించడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లతో అభివృద్ధి “మూడు పువ్వులు- ఆరు కాయలుగా” వెలుగుతుందని తెలిపారు. అదేవిధంగా నియోజకవర్గంలోని మంత్రి సత్తి కుమార్ యాదవ్ టిడిపి ఇన్చార్జి పరిటాల శ్రీరామ్తో కలిసి సమన్వయం చేసుకొని కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి న్యాయం చేయడం జరుగుతుందని తెలిపారు. మరి ఓడిపోయిన కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి నేను ఏమి చేశానని….! ప్రజలు నన్ను ఓడించాలని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. అతి త్వరలో వైసిపి పార్టీ కనుమరుగు అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం మరో 20 ఏళ్లు అధికారంలో ఉంటుందని వారు తెలిపారు. 28 రోజుల్లో సత్య కుమార్ యాదవ్ ధర్మారంలో రావడం రోజుకు ఐదు గంటలు చొప్పున నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తూ ప్రజల హృదయాలలో గూడు కట్టుకున్నాడని తెలిపారు. అంతేకాకుండా సత్య కుమార్ యాదవ్కు వైద్యఆరోగ్య శాఖ మంత్రిగా రావడం పట్ల ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ధర్మవరం నియోజకవర్గం మరింత అభివృద్ధి చేసేందుకు జనసేన, టిడిపి, బిజెపి సమన్వయంతో ముందుకు వెళ్లడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు బెస్త శ్రీనివాసులు, అడ్డగిరి శ్యాం కుమార్, వెంకటరెడ్డి, బాలకృష్ణ, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img