Friday, May 31, 2024
Friday, May 31, 2024

సీతానగరం మండలంను విడిచిపెట్టిన ఏనుగులగుంపు

విశాలాంధ్ర, సీతానగరం: పార్వతీపురం మన్యం జిల్లాలోని ఏనుగులగుంపు సీతానగరం మండలంను విడిచిపెట్టి పార్వతీపురం – గరుగుబిల్లి మండలాల వైపు వెళ్ళాయి. మండలంలోని బుడ్డిపేట అనంతరాయుడుపేట, పెదబోగిలి, చిన భోగిలి, వెంకటాపురం, లక్ష్మిపురం, బూర్జ, సుభద్ర సీతారాంపురంగ్రామాలలో గత 10రోజులుగా ఉండి పంటలను నాశనం చేశాయి. ఏనుగులు తరలి వెళ్లడంతో పంట నష్టరిహారాన్ని అంచనా వేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. వ్యవసాయ, రెవెన్యూ, అటవీఅధికారులు ఏనుగులు నాశనం చేసిన పంటలను పరిశీలించి తమకు న్యాయం చేయాలని వారంతా కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img