Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

గురుకులాలో ప్రవేశాలకు దరఖాస్తులకు ఆహ్వానం

. 5నుండి డిగ్రీ అడ్మిషన్లకు ఈనెల 24లోగా అర్హులు దరఖాస్తులు చేసుకోవాలి

. జిల్లా విద్యాశాఖాధికారి డాక్టరు రమణ


విశాలాంధ్ర – పార్వతీపురం : ఆంధ్ర ప్రదేశ్ గురుకుల విద్యాలయాలలో ప్రవేశానికి
ఈనెల 24లోగా అర్హులైన విధ్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ ఎస్.డి.వి.రమణ తెలిపారు. బుదవారం ఆంధ్ర ప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలలో 2023 – 24 విద్యా సంవత్సరంలో చేరుటకు నోటిఫికేషన్ కు సంబందించి పోస్టర్లను బొబ్బిలి గురుకులం ప్రిన్సిపాల్, మన్యంజిల్లా కన్వీనర్ కె. రఘునాథ్ తో కలిసి జిల్లా విద్యాశాఖ ఆద్వర్యంలో విడుదల చేశారు.
ఈసంధర్భంగా జిల్లా విద్యాశాఖాదికారి డాక్టరు రమణ, కన్వీనర్ రఘునాథ్ లు మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ గురుకుల విద్యాలయాలు ప్రామాణిక విద్యకు నిలయాలుగా కొనసాగుతున్నాయన్నారు. 5వతరగతిలో అన్ని సీట్లను, 6,7,8 తరగతులలో ఖాళీగా ఉండే సీట్లు ప్రవేశ పరీక్ష ద్వారా భర్తీ చేస్తామని చెప్పారు.5వ తరగతి నుండి ఇంటర్మీడియట్, డిగ్రీ చదువుటకు ఆసక్తి గల విద్యార్థులు http://aprs.apcfss.in వెబ్ సైట్ లో ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను ఈనెల 24లోగా దరఖాస్తులు కోరుతున్నట్లు తెలిపారు. మే20న ప్రవేశ పరీక్షను అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తామని చెప్పారు.
మే 20న ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటలవరకు 5,6,7,8 తరగతులకు, మధ్యాహ్నం 2.20 గంటల నుండి సాయంత్రం 5 గంటలవరకు జూనియర్, డిగ్రీ కళాశాలలకు ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. రాష్ట్రంలోని 12మైనారిటీ గురుకుల పాఠశాలలో, 3మైనారిటీ జూనియర్ కళాశాలలో
ఎటువంటి ప్రవేశ పరీక్ష లేకుండా నేరుగానే మే 15న మైనారిటీలకు అడ్మిషన్లు చేయడం జరుగుతుందని తెలిపారు.
బొబ్బిలి ఆంధ్ర ప్రదేశ్ గురుకుల విద్యాలయ ప్రిన్సిపాల్ మరియు పార్వతీపురం మన్యంజిల్లా పరీక్షల కన్వీనర్ డా. కె.రఘునాథ్ మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ గురుకుల విద్యాలయాలలో విలువలతో కూడిన ప్రామాణిక విద్యను అందజేస్తున్నామని తెలిపారు.అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల ఆద్వర్యంలో బోధన ఉంటుందని తెలిపారు. ఉచితవసతి, పౌష్ఠిక విలువలతో కూడిన భోజనం లభిస్తుందని, క్రీడలు, సహపాఠ్యాంశాలు, ఆరోగ్యం, వినోదం, ఆహ్లాదకరవాతావరణం ఉంటుందనితెలిపారు. ఈకార్యక్రమంలో విద్యాశాఖ సహాయసంచాలకులు ఎంఇ.రమాజ్యోతి, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img