Sunday, December 4, 2022
Sunday, December 4, 2022

ఇళ్ళను త్వరితగతిన నిర్మాణంచేయండి

విశాలాంధ్ర, సీతానగరం: మండలంలో జగనన్న కాలనీలోఇళ్ళను, వ్యక్తిగతంగా నిర్మిస్తున్న త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేయండని గృహ నిర్మాణ శాఖ పధక సంచాలకులు రఘురాం పిలుపు నిచ్చారు. గురువారం మండలంలోని జానుమల్లు వలస గ్రామ పంచాయతీలో జగనన్న లే అవుట్ పరిశీలించి లబ్దిదారులతో మాట్లాడారు. ఇళ్ళస్థలాలలో నిర్మాణాలు వేగవంతంగా పూర్తిచేయాలని కోరారు.మండలములో ఇంకా ప్రారంభం చేయని ఇళ్లనుసత్వరమే పనులు ప్రారంభం చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ జూనియర్ ఇంజనీర్ జానకీరామ్,సర్పంచ్ యాల్ల వెంకటనాయుడు,గృహ నిర్మాణ శాఖ వర్క్ ఇన్స్పెక్టర్ కృష్ణ,సచివాలయం సిబ్బంది,లబ్ధిదారులు .తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img