Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

రబీ పంటకు పెసలు, మినుములు, కట్టె జనుములు సిద్దం: ఏఓ అవినాష్

విశాలాంధ్ర,సీతానగరం: రబీసీజన్ కు సంబందించి పెసలు,మినుములు, కట్టె జనుములు సిద్ధంగా ఉన్నాయని, కావాల్సిన రైతులు రైతు భరోసా కేంద్రాలను సంప్రదించాలని మండల వ్యవసాయాధికారి ఎస్. అవినాష్ తెలిపారు.గురువారం ఆయన జిల్లా వ్యవసాయ సలహా మండలి అధ్యక్షుడు వాకాడ నాగేశ్వరరావును కలిసి మండలములోని వ్యవసాయ పరిస్థితులు వివరించారు. మండలంలోని 3వేల500
ఎకరాల్లో కోతలు అయ్యావని చెప్పారు. నిడగల్లు, బగ్గందొరవలస, కోటసీతారం పూరం గ్రామాల్లో నూర్పులు చేసినరైతులు 800బస్తాలు ధాన్యంకూడా సిద్ధంచేసారని చెప్పారు. త్వరలోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా ప్రారంభం చేస్తామని చెప్పారు.నిడగల్లు రైతు భరోసా కేంద్రానికి 3వేల గోనెసంచులు అందజేశామని చెప్పారు. మండలములో 128పంటకోత ప్రయోగాలు చెయ్యల్సి ఉండగా ఇంతవరకు 30 పూర్తిచేశామని తెలిపారు. వ్యవసాయ, రెవెన్యూ, సర్వే, బ్యాంకు, గణాంక సిబ్బంది సమక్షంలో పంట కోత ప్రయోగాలు నిర్వహించి దిగుబడి తెలుసుకోవడం జరుగుతుందని, దీనిద్వారా మండలపరిధిలోని దిగుబడి అంచనా వేస్తామని చెప్పారు.ఒక్కొక్క రైతుపొలంలోని 5×5 మీటర్ల సైజు పంటలో జరిపిన పంటకోత ప్రయోగంలో సరాసరి దిగుబడి 16కేజీలు వస్తున్నట్లు చెప్పారు. పిఎం కిషాన్ ఈకేవైసికి, ఈ పంట నమోదుకు మరలాప్రభుత్వము అవకాశం ఇచ్చిందని, గతంలో చేయని రైతులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈఏడాది ధాన్యం కొనుగోలును జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పకడ్బందీగా నిర్వహించేందుకు ఆన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.శనివారం జిల్లాలో జరిగే వ్యవసాయ సలహా మండలి సమావేశంలో దీనిపై స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉందన్నారు. అన్ని సచివాలయాల్లో రైతు భరోసా కేంద్రాల ద్వారా మెరుగున సేవకు అందించేందుకు వ్యవసాయ సహాయకులు కృషి చేస్తున్నారని,వ్యవసాయ సలహాలకు, సందేహాలు తీర్చుకోవడానికి ఆర్ బి కేల సిబ్బందిని సంప్రదించాలని కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img