Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఘనంగా ముగిసిన చక్ర ధర స్వామి డోలోత్సవాలు

కమనీయం స్వామివారి కామదహనం .
స్వామివారిని అధిక సంఖ్యలో దర్శించుకున్న భక్తులు.

విశాలాంధ్ర-కవిటి:మండలంలోని బెజ్జిపుట్టుగ గ్రామంలో శ్రీ చక్ర పెరుమాళ్ళ స్వామివారి డోలోత్సవాలు మంగళవారం ఉదయం తో ఘనంగా ముగిసాయి.ఈ కార్యక్రమంలో భాగంగా వేకువ జామున స్వామివారికి ప్రత్యేక రధముపై దేవుని మాన్యము ప్రాంతానికి తీసుకు వెళ్లి అర్చకులు సత్యం స్వామి,రాజు స్వామి,రాజేష్ స్వాముల ఆధ్వర్యంలో కన్నుల పండువగా కామ దహన కార్యక్రమం చేపట్టారు. అనంతరం దేవుని మండపం వద్ద డోలారోహణం, వసంతోత్సవం కార్యక్రమం చేపట్టారు.అలాగే స్వామివారి తిరువీధుల కార్యక్రమం అనంతరం చక్రస్నానంతో స్వామివారి డోలోత్సవంలు ముగిశాయి.ఈ కార్యక్రమానికి ముందుగా సోమవారం రాత్రి చుట్టుప్రక్కల గ్రామాలతో పాటు జిల్లా కేంద్రం నుండి ఒరిస్సా నుండి కూడా అధిక సంఖ్యలో భక్తులు స్వామివారికి దర్శించుకున్నారు.ఈ సందర్భంగా గ్రామం జనసంద్రంగా మారింది. భక్తులకు ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్సై రాము పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు పొందల కృష్ణారావు, పి వి ఎస్ రాంబాబు,పొందల విజయకష్ణ లతో పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img