Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

శాంతి భద్రతల పరిరక్షణకు సిపిఎస్ ఉద్యోగులు సహకరించాలి

సెప్టెంబరుఒకటి,11తేదీల్లోకార్యక్రమాలకు ఎటువంటి అనుమతులు లేవు
జిల్లాఎస్పీ విద్యాసాగర్ నాయుడు

విశాలాంధ్ర,పార్వతీపురం: శాంతి భద్రతల పరిరక్షణకు సిపిఎస్ ఉద్యోగులు సకకారాన్ని అందించాలని, సెప్టెంబరు ఒకటి, 11తేదీల్లో నిర్వహించనున్న నిరసన కార్యక్రమాలకు ఎటువంటి అనుమతులులేవని పార్వతీపురం మన్యం జిల్లాఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు తెలిపారు.మంగళవారం ఆయన ఒక పత్రికప్రకటన విడుదల చేశారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిపిఎస్ ఉద్యోగులు, సంఘాలనేతలు సెప్టెంబరు1న ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడికి పిలుపునిచ్చి మరలా సెప్టెంబరు 11కు మార్చిన నేపథ్యంలో జిల్లాలో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.బందోబస్తు ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఈప్రకటనలో చట్టఉల్లంఘనకు పాల్పడినా, కుట్రపూరిత వ్యాఖ్యలు చేసినా,ఉద్యోగులను రెచ్చగొట్టే విధంగా ప్రేరేపించినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా కార్యాచరణ రూపొందించినా చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని తెలిపారు
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేయాలని నిరసనగా ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగ సంఘాలు 0న తలపెట్టిన ముఖ్యమంత్రి  ఇల్లు ముట్టడికార్యక్రమాలకు ఎటువంటి అనుమతులు లేవన్నారు.అధేవిధంగా సెప్టెంబరు 11న తలపెట్టిన కార్యక్రమానికి కూడా ఎటువంటి అనుమతులు లేవని తెలిపారు.  కనుక శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని ఖచ్చితమైన సమాచారం ఉన్నందున ఇప్పటికే సిపీఎస్ ఉద్యోగులకు ముందస్తు నోటీసులు జారీ చేయడం జరిగిందని, పోలీసువారి నోటీసులను ఉల్లంఘించినా,  కుట్రపూరిత వ్యాఖ్యలు చేసినా,  ఉద్యోగులను రెచ్చగొట్టే విధంగా ప్రేరేపించినా,  శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా కార్యాచరణ రూపొందించినా, తధుపరి తీసుకొనే క్రిమినల్ చర్యలుకు బాధ్యులు అవుతారని ఆయన తెలిపారు.
రైల్వే స్టేషన్, బస్టాండ్లలలో ముఖ్యమైన ప్రదేశాలలో పోలీస్ అధికారులు మరియు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయడమైనదన్నారు.చెక్ పోస్టులు, పికెట్లు మరియు వాహన తనిఖీలు ఏర్పాటు చేయడమైనదన్నారు.
పోలీసువారికిపూర్తిగాసహకరించవలసిందిగా కోరారు .కావున ఉద్యోగ సంఘాలు అందరూ అనుమతిలేని ఈకార్యక్రమంలో పాల్గొనరాదని శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దని  ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img