Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఈనెల 5, 6తేదీల్లో ధర్నాను విజయవంతం చేయాలి

విశాలాంధ్ర – సీతానగరం : ఉద్యోగ,ఉపాధ్యాయుల ప్రధానసమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర యూనియన్ పిలుపుమేరకు ఈనెల 5, 6తేదీలలో జిల్లాలోని పాతతాలూకా కేంద్రాలలో ధర్నాను నిర్వహించనున్నట్లు పార్వతీపురం మన్యంజిల్లాశాఖ ఏపిటిఎఫ్ ప్రధానకార్యదర్శి బాలకృష్ణ తెలిపారు బుదవారం సీతానగరం ఉన్నత పాఠశాలలో జరిగిన ఒకసమావేశంలో బాలకృష్ణ మాట్లాడుతూ సిపిఎస్ రద్దు, కొత్త వేతన కమీషన్ ఏర్పాటు, కరువు భత్యం బకాయిలచెల్లింపు, ప్రావిడెంట్ ఫండ్, ఏపీజీఎల్ఐ చెల్లింపులు మొదలగు సమస్యలు దీర్ఘకాలంగా పెండింగులో ఉన్నాయని చెప్పారు.రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుందనిప్రకటిస్తూ, ఉపాధ్యాయులకు మాత్రం ప్రతినెలా మొదటి తారీకున జీతాలు చెల్లించకపోవడంపట్ల అసహనం తెలియజేశారు. సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 5, 6 తేదీల్లో ఆయా తాలూకా కేంద్రాల్లో జరిగే ధర్నాలో ఉపాధ్యాయ, ఉద్యోగ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఈకార్యక్రమంలో బలిజిపేటమండల శాఖ అధ్యక్షుడు గుల్లరామారావు, సీనియర్ కార్యకర్తలు డోకలరాము, బంకురు జోగినాయుడు తదితరులుపాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img