Friday, May 31, 2024
Friday, May 31, 2024

చెల్లంనాయుడువలసలో 56మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ

విశాలాంధ్ర,సీతానగరం: పార్టీలకు అతీతంగా అర్హులైన నిరుపేదలకు ఇళ్ల పట్టాలు అందజేసినఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికే దక్కుతుందని ఎమ్మెల్యే అలజింగి జోగారావు తెలిపారు.గురువారం మండలంలోని చెల్లంనాయుడువలస గ్రామంలో 56మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే చేతులమీదుగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేసారు.ఈసందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయనమాట్లాడుతూ అర్హులైన వారికి పెద్దఎత్తున సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారని చెప్పారు. ఈకార్యక్రమంలో దాన్యాన్ని దళారుల ప్రమేయం లేకుండా నేరుగా రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తామని తెలిపారు.ఈకార్యక్రమంలో ఎంపిడిఓ కృష్ణ మహేశ్ రెడ్డి, డిప్యూటీ తహశీల్దార్ షేక్ ఇబ్రహీం, ఈఓపిఆర్దీ వర్మ, ఆర్ డబ్ల్యు ఎస్ జేఈ పవన్ కుమార్ తోపాటు మండల, గ్రామప్రజాప్రతినిధులు, వైఎస్సార్సీపీనేతలు ,సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. గతంలో గడప గడపకు మనప్రభుత్వ కార్యక్రమం సందర్భంగా ఈగ్రామంలో జరిగిన సంఘటనలు దృష్ట్యా పెద్దఎత్తున పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎస్ఐ నీలకంఠం అధ్వర్యంలో కార్యక్రమం ప్రారంభంనుంచి ముగింపువరకు నిశితంగా పరిశీలించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img