Friday, April 19, 2024
Friday, April 19, 2024

అక్టోబర్ 2 నాటికి పాస్ పుస్తకాలు పంపిణీ

ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజయ్ కల్లాం

విశాలాంధ్ర – శ్రీకాకుళం: రాష్ట్రంలో చేపట్టిన వై.యస్.ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు- భూరక్ష పథకం రీసర్వే దాదాపు పూర్తవుతుందని, అక్టోబర్ 2 నాటికి శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం జిల్లాల్లోని సుమారు 400 గ్రామాల్లో భూహక్కు పాస్ పుస్తకాలను పంపిణీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు మరియు వై.ఎస్.ఆర్.జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పథకం రాష్ట్ర స్థాయి స్టీరింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ కమిటీ చైర్మన్ అజయ్ కల్లాం పేర్కొన్నారు. జగనన్న శాశ్వత భూ హక్కు- భూరక్ష పథకం అమలులో భాగంగా చేపట్టిన రీ సర్వే పై శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం జిల్లా కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లతో సమీక్షించిన ఆయన సమీక్ష అనంతరం పాత్రికేయులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చరిత్రలో నిలిచిపోయేలా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త పథకానికి నాంది పలికిన విషయం అయితే అన్నారు. అందులో భాగంగా పథకం అమలు తీరు పరిశీలన మరియు సమస్యల పరిష్కార దిశగా మూడు జిల్లాల కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలోని మిగతా జిల్లాలతో పోలిస్తే ఈ మూడు జిల్లాల్లో ప్రగతి చాలా బాగుందని కితాబిచ్చారు. మూడు జిల్లాల కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లు ప్రత్యేక చొరవ తీసుకుని ముందుకు నడుపుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమం పూర్తయితే దాదాపు 90% భూ సమస్యలు పరిష్కారం అయినట్లే అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంపై కింద స్థాయిలో కూడా మంచి స్పందన లభిస్తుందని, అలాగే రైతులు కూడా ఈ కార్యక్రమం పట్ల సంతృప్తిగా ఉన్నట్లు సమీక్షలో పాల్గొన్న రైతులు తెలిపారని అన్నారు. ప్రస్తుతం ఈ సర్వే ప్రగతి చాలా బాగుందని, దాదాపు 30 శాతం రోడ్ ఫ్లైయింగ్ కూడా అయిపోయిందని అన్నారు. అక్టోబర్ 2 నాటికి శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం జిల్లాల్లో దాదాపు 400 గ్రామాలకు సంబంధించిన పాస్ పుస్తకాలను పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ముఖ్య సలహాదారుగా వివరించారు. ఈ సమావేశంలో సర్వే సెటిల్ మెంట్స్,ల్యాండ్ రికార్డ్స్ కమీషనర్ సిద్దార్ద్ జైన్, అదనపు సంచాలకులు శ్రీనివాసులు, శ్రీకాకుళం, పార్వతీపురం జిల్లాల కలెక్టర్లు శ్రీకేశ్ లాఠకర్, నిశాంత్ కుమార్, సంయుక్త కలెక్టర్లు ఎం.విజయ సునీత, ఓ.ఆనంద్, కె.మయూర్ అశోక్ (విజయనగరం) తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img