Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఏనుగులను సురక్షిత ప్రాంతానికి తక్షణమే తరలించాలి

ఏనుగులవల్ల ప్రాణాలు పోయిన కుటుంబాలలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలి : సీపీఐ కార్యదర్శి కూరంగి మన్మదరావు డిమాండ్

విశాలాంధ్ర,పార్వతీపురం:ఏనుగులకు ఇంకా ఎంతమంది బలవ్వాలని ప్రశ్నిస్తూ తక్షణమే ఏనుగుల గుంపును తరలించాలని, ఏనుగుల వల్ల మృతి చెందిన కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని పార్వతీపురం మన్యం జిల్లా సీపీఐ కార్యదర్శి కూరంగి మన్మదరావు డిమాండ్ చేశారు.బుదవారం
జిల్లా అటవీ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు.కొమరాడ మండలంకళ్ళికోట గ్రామంలో ఏనుగు దాడిలో మరణించిన కౌలు రైతు దాసరి గోవిందతోపాటు ఇటీవలకాలంలో అటు పాలకొండలో ఇటుపార్వతీపురంలో ఉన్న ఏనుగుల గుంపుల వల్ల సుమారు 8 మంది వరకు మృతి చెందడం జరిగిందన్నారు. నేటికి కొన్ని కుటుంబాలకు పరిహారం పూర్తిగా అందలేదన్నారు. వేలాది ఎకరాల్లో వరి,అరటి,చెరకు వంటి వందలాది ఎకరాల్లో పంట నష్టం జరిగినప్పటికీ నేటికి రైతులకు అందలేదని అదే సందర్భంలో అనేక చోట్ల ఏనుగుల దాడిలో మూగ జీవాలు మృతి చెందాయని వాటికి పూర్తి పరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. తక్షణమే రెండు చోట్ల ఉన్న ఏనుగుల గుంపులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. అంతవరకు రైతుల పక్షాన ఈ ప్రాంత ప్రజల పక్షాన సిపిఐ పార్టీ పోరాటం చేస్తుంది తెలిపారు.ఈకార్యక్రమంలో తోటజీవన్,సహాయ కార్యదర్శి, బుడితి అప్పలనాయుడు సంఘం జిల్లా కార్యదర్శి,పార్టీ కార్యవర్గ సభ్యులు జి సూరయ్య,ఈవీ నాయుడు,జిల్లా సమితి నాయకులు పువ్వుల ప్రసాదు తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img