Monday, December 5, 2022
Monday, December 5, 2022

అన్ని గ్రామపంచాయతీల్లో ఎస్ డి పి సర్వే

విశాలాంధ్ర – సీతానగరం: మండలంలోని అన్నిగ్రామాల్లో ఎస్ డి పి సర్వే ముమ్మరంగా జరుగుతుంది. గ్రామాలలో ఇంటింటికి వెళ్లి చిన్నారుల వివరాలు, పోషక విలువలు, రక్త శాతం, ఇంట్లో చదువుతున్న బాలికల వివరాలు నమోదు పంచాయతీ కార్యదర్శులు గ్రామ వాలంటీర్లు ద్వారా చేస్తున్నారు. నిడగల్లు, సూరమ్మపేట, పెదబోగీలి, చినబోగీలి, గుచ్చిమి తదితరగ్రామాల్లోముమ్మరంగా జరుగుతున్నాయి. ఏగోటివలసగ్రామంలో ప్రభుత్వం అమలు చేయుచున్న స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలపై చేస్తున్న సర్వేను మండల పంచాయతీ విస్తరణ అధికారి వర్మ పరిశీలించారు. పలు సూచనలు చేశారు. గ్రామంలోని పారిశుధ్య నిర్వహణ గూర్చి, చెత్తసంపదకేంద్ర నిర్మాణంచేపట్టుట గురించి సర్పంచ్ రాధాకృష్ణ,పంచాయతీ కార్యదర్శి వెంకటనాయుడులకు సూచనలు జారీ చేశారు. 

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img