Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్ల కోసం అధ్యాపకుల ముమ్మర ప్రచారం


*నాలుగు జనరల్, ఆరు వృత్తి విద్యా కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
*అన్నింటిలో మిన్న మా ప్రభుత్వ జూనియర్ కళాశాల:ప్రిన్సిపాల్ రాజు


విశాలాంధ్ర,పార్వతీపురం/బెలగాం : పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో పురాతన కళాశాలగా, ఎంతో మంది మేధావులను తీర్చిదిద్దిన కళాశాలగా పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలకు నాటి నుండి నేటి వరకు పేరు ఉండటం గమనార్హం.ఈకళాశాల విద్యతో పాటు ఎంతోమంది క్రీడాకారులను కూడా తీర్చి దిద్దిన ఘనత కూడా ఉంది.నేడు జిల్లా ఏర్పడిన తరువాత ప్రభుత్వ కార్యక్రమం ఏది చేయాలన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన మైదానమే వేదికగా ఉంటున్న సంగతి తెలిసిందే. అటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంపీసీ, బైపిసి, హెచ్ఈసి, సిఈసి గ్రూపులు ఉండి, తెలుగు ఇంగ్లీష్ మీడియంలో బోధన చేస్తున్నారు. దీంతో పాటు సి ఎస్ ఈ, సిఈటి, ఫిషరీస్, ఎంఅండ్ఏటి, ఓఏ, ఎంపీ హెచ్ డబ్ల్యు (ఫీమేల్) వృత్తి విద్యా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేటుకు ధీటుగా, ఉన్నతవిద్యార్హతలు కలిగి పోటీ ప్రపంచానికి ధీటుగా బోధన చేసే అధ్యాపకులు ఉండి మెరుగైన ఫలితాలు సాధనకు కృషి చేస్తున్న కళాశాలగా నడుస్తుంది. దాదాపు వెయ్యిమంది విధ్యార్ధులు ప్రధమా, ద్వితీయ సంవత్సర ఇంటర్ కోర్సులనుఇక్కడ చదువుతున్నారు.
అడ్మిషన్లు గూర్చి విస్కృత ప్రచారం: ప్రిన్సిపల్ ఆకుల రాజు
పార్వతీపురం పట్టణం, చుట్టుప్రక్కల గ్రామాలలో, చుట్టుప్రక్కల మండలాల్లో పదవతరగతి పరీక్షలు రాసిన విద్యార్థులను, వారితల్లిదండ్రులను కలుస్తూ అడ్మిషన్లు గూర్చి విస్కృత ప్రచారాన్ని చేస్తున్నట్లు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఆకుల రాజు తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 47మంది రెగ్యులర్, కాంట్రాక్టు లెక్చరర్లు టీములుగాఏర్పడి ఇంటర్ బోర్డు అదేశాలు, సూచనలు మేరకు ప్రచారాన్ని చేస్తున్నట్లు తెలిపారు. జూనియర్ కళాశాలలోని సదుపాయాలు, సౌకర్యాలు, బోధన – అభ్యసన కార్యక్రమాల వివరాలు, ఉచిత పుస్తకాలు సరఫరా, అమ్మఒడి పథకం, నాడు నేడు కార్యక్రమం ద్వారా కళాశాల ఆధునికీకరణ, డిజిటల్ బోధన మొదలైన వాటిగురించి తల్లిదండ్రులకు వివరిస్తున్నట్లు చెప్పారు. క్యూఆర్ కోడ్ ను కలిగి ఉన్నకరపత్రాలను కూడా పంచి పెడుతూ ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చూస్తే కళాశాలలోని సదుపాయాలు సౌకర్యాలను ఫోటోలరూపంలో చూడవచ్చని విద్యార్థులకు, తల్లిదండ్రులకు చెబుతున్నట్లు తెలిపారు. ఎండను సహితం లెక్కచేయకుండా గ్రామాలలోని వీధులలో పర్యటిస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులతో మాట్లాడి పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్య అభ్యసించడానికి చేరమని అధ్యాపకులు ఇంటింటికి వెళ్లి ప్రచారాన్ని చేస్తున్నట్లు తెలిపారు.కళాశాలలో సిసి కెమెరాల పర్యవేక్షణ, ఆర్ ఓ ప్లాంటు ద్వారా త్రాగునీరు సరాపరా, విశాలమైన తరగతి గదులు, ఉచితంగా పాఠ్య పుస్తకాలు సరఫరా, వెనుకబడిన విధ్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహణ, ఎస్సీ,ఎస్టీ బీసీల విధ్యార్థులకు హాస్టల్ సదుపాయం తదితర సౌకర్యాలు అందుబాటులో ఉన్న కళాశాలని ప్రిన్సిపాల్ రాజు తెలిపారు. ఇటీవల జిల్లా ఏర్పడిన తరువాత గత ఏడాదిగా ప్రభుత్వ నిర్వహిస్తున్న ప్రతీ కార్యక్రమంకు వేదికగా తమ జూనియర్ కళాశాల ఉండటంతోపాటు తనను వ్యాఖ్యాతగా వ్యవహరించమనడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. కళాశాల పేరు ప్రఖ్యాతులు పెంచేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img