Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

వెలుగు మహిళలలు లక్షాదికార్లు, వ్యాపార వేత్తలుగా తయారుకావాలి

మండల కేంద్రాల్లో మహిళా మార్టులను ఏర్పాటు చేయాలి
జీవనోపాధి స్థాయిని మరింత పెంచాలి:
వెలుగు జిల్లాప్రోజెక్టుడైరెక్టర్ కిరణ్ కుమార్

విశాలాంధ్ర,సీతానగరం: మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించడానికి 25ఏళ్ల క్రితం ఏర్పాటుచేసిన మహిళా సంఘాల సభ్యులంతా నేడు లక్షాదికార్లు, వ్యాపార వేత్తలుగా తయారు కావాలని పార్వతీపురం మన్యం జిల్లా వెలుగు పథక సంచాలకులు పెద్దింటి కిరణ్ కుమార్ పిలుపునిచ్చారు.గురువారంనాడు మండల వెలుగు కార్యాలయంలో జరిగిన మండల గ్రామైక్యసంఘాల సమీక్షసమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.జీవనోపాధి స్థాయిని పెంచడానికి, మహిళలో పేదరికాన్ని నియంత్రణ చేయడానికి ఏర్పాటుచేసిన సంఘాల సభ్యులు అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా మండల,
గ్రామైక్య సంఘాల నాయకులు ఆలోచన చేయాలనీ సూచించారు.మహిళలు ప్రభుత్వం అందజేస్తున్న వివిధ పథకాలతో పాటు బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి, సున్నా వడ్డీ లోన్లు తదితర పధకాల పేరిట పెద్ద ఎత్తున రుణాలు తీసుకొని నిర్ణీత సమయంలో రుణాలు కట్టడం గూర్చి ఆలోచన తప్ప దానిద్వారా వ్యాపార అభివృధ్ధి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి మహిళా సంఘాల నాయకులు ఆలోచన చేయాలనీ సూచించారు. కొత్తగా ప్రతీ మండల కేంద్రములో మహిళలు అంతా కలిసికట్టుగా తక్కువ ఖర్చుతో అధిక రాబడి తెచ్చిపెట్టే మహిళామార్టుల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని కోరారు. పెద్ద పెద్ద సంస్థలు వ్యాపారంద్వారా సాధించిన విజయాలను వివరించి, మహిళా సంఘాల సభ్యులంతా కూడా ఆదిశగా ఆలోచన చేయాలనీ సూచించారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగ్మోహన్రెడ్డి ప్రభుత్యం మహిళల అభ్యున్నతికి ఎన్నో పధకాలను ప్రవేశపెట్టి కృషి చేస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.మహిళలో కెపాసిటీ బిల్డింగ్ పెంచాలని, వారి ఆలోచన సరళిని మార్చేందుకు కృషి చేయాలని కోరారు. మండలంలో మహిళా సంఘాల నిర్వహణ, పుస్తక నిర్వహణ, స్త్రీనిధి నిర్వహణ, రికవరీ తదితర అంశాలపై సంతృప్తి వ్యక్తంచేశారు.మండలంలోని 41గ్రామైక్యసంఘాల పరిధిలోని 1720 వెలుగు సంఘాలలో
దాదాపు 18వేలమంది సభ్యులు ఉన్నారని వెలుగు సహాయ ప్రోగ్రాం అధికారి రెడ్డి శ్రీరాములు తెలిపారు.మండలంలో వెలుగు ద్వారా చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. మహిళల అభ్యున్నతికి చేస్తున్న కృషిని వివరించారు.ప్రభుత్వ లక్ష్యాలు నెరవేర్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో స్త్రీనిధి ఏజిఎం హేమలత, ఐబి,చేయూత,
హెచ్ డి సహాయ ప్రోగ్రాం అధికారులు జయమ్మ,సతీష్, త్రినాధమ్మ , స్త్రీనిధి జిల్లా మేనేజర్ చంద్ర మహేశ్, సహకార బ్యాంకు మేనేజర్,ఉద్యోగులు,
వెలుగు సిసిలు కోటేశ్వర రావు,అప్పారావు,ఆనందరావు, మోహనరావు,మండలంలోని 40 గ్రామైక్య సంఘాల అధ్యక్షులు, వెలుగు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img