Friday, May 3, 2024
Friday, May 3, 2024

వాడ వాడలా ఘనంగా జరిగిన గుడ్ ఫ్రైడే వేడుకలు

విశాలాంధ్ర – సీతానగరం : మండలంలోని వాడ వాడలా శుక్రవారము నాడు గుడ్ ఫ్రైడే వేడుకలను ఘనంగా క్రైస్తవ సోదర సోదరీ మణులు జరుపుకున్నారు. సీతానగరం, పెదబోగీలి, చినబోగిలి , కాసాపేట, పనుకుపేట,అంటిపేట, లచ్చయ్యపేట, జోగమ్మ పేట, గూచ్చిమి, మరిపివలస, నిడగల్లు, బూర్జ, లక్ష్మి పురం, పెదంకలం, తామరఖండి, గెడ్డలుప్పి, బక్కుపేట, కొత్తవలస, గాదెలవలస తదితర గ్రామాల్లో చర్చిలలో శుక్రవారం క్రైస్తవ సోదర సోదరీమణుల నడుమ ఘనంగా గుడ్ ఫ్రైడేను నిర్వహించుకున్నారు. అన్ని చర్చిలలో గుడ్ ఫ్రైడే సందర్బంగా బైబిల్ లోని ముఖ్యమైన ఘట్టాలను చదివి ఆయా చర్చిల పాస్టర్లు వినిపించారు.
గుడ్ ఫ్రై డే యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ, క్రైస్తవుని యొక్క సందేశాలను వినిపించారు. క్రీస్తు మరణానికి సంబంధించినదే గుడ్ ఫ్రైడేనని, సకల మానవాళి కళ్యాణం కోసం మరణాన్ని ఆహ్వానించిన క్రీస్తులోని అనంతమైన ప్రేమకు కారణం ఈ శుభశుక్రవారమని పాస్టర్లు తెలిపారు. ఈస్టర్ మరణించిన క్రీస్తు తిరిగి లేచిన పునరుద్ధానం పొందిన రోజని తెలిపారు. ఏసుప్రభు మహిమను లోకానికి వెల్లడించడానికి, ఇది దోహద పడిందని, ఆయన త్యాగపూరితమైన మరణం, ఆయన పునరజీవానికి కారణమైన ఆశుక్రవారంనే శుభశుక్రవారం అని పలుకుతారని తెలిపారు. క్రైస్తవ విశ్వాసులు దీన్ని గాడ్ ఫ్రైడే గా కూడా భావించడం జరుగుతుందని తెలిపారు. గుడ్ ఫ్రైడే అనేమాట ఒక మహామహిమ వల్ల కలిగిన గొప్ప ఫలితాన్ని సూచిస్తుందని తెలిపారు. లోకానికి కావలసినది ఏమిటో ఏసుప్రభువు బోధించాడని తెలిపారు. ఏసుప్రభు అద్భుతాలతో పాటు అర్థంకాని వారికోసం తన మహిమలేవి ప్రకటించకుండా, సాదాసీదా వ్యక్తిగా ప్రాణాలు అర్పించాడని తెలిపారు. ఆ తర్వాత తనదైన సహజ దైవ శక్తితో మరణము నుంచి తిరిగి లేయడమే ఈస్టర్ అని తెలిపారు. పాప భూయిష్టమైన నరుడి దుష్ప్రవర్తన త్యాగపూరితము కావాలని, ప్రేమ భరితం కావాలని, సేవా రూపంలోకి పరిణామం చెందాలని, తనలోని చెడును తొలగించుకొని, పరిపూర్ణ మానవుడిగా పునరుత్థానం చెందాలన్నదే గుడ్ ఫ్రైడే యొక్క ముఖ్యమైన విషయమని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img