జిల్లా వ్యవసాయశాఖ జాయింట్ డెరైక్టర్
విశాలాంధ్ర – పార్వతీపురం : రైతన్నల సంక్షేమంకోసం ముఖ్యమంత్రి వైఎస్
జగన్నోహన్ రెడ్డి చేస్తున్నకృషి అభినందనీయమని జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డెరైక్టర్ రాబర్ట్ పాల్ తెలిపారు.శనివారం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని రైతుదినోత్సవంగా ప్రభుత్వం నిర్వహిస్తున్నట్లు తెలిపారు జిల్లాలో సాలూరులో మొదటి ల్యాబ్ నేడు ప్రారంభించగా, మిగిలిన నియోజక వర్గాల్లో త్వరలోనే ప్రారంభం చేస్తామని చెప్పారు.వ్యవసాయ ఉత్పాదకాల నాణ్యత నిర్ధారణ కోసం డాక్టర్ వైఎస్ఆర్ అగ్రిటెస్ట్ ల్యాబ్ లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు.