Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

సాక్షర భారత్ విసిఓలకు ఇచ్చిన హామీ అమలు చేయాలి

ఏఐటీయూసీ ఉమ్మడి జిల్లాల ప్రధాన కార్యదర్శి, సాక్షర భారత్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులు బుగత అశోక్

విశాలాంధ్ర,పార్వతీపురం:సాక్షర భారత్ గ్రామసమన్వయకర్తలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజయనగరం జిల్లాలో ప్రతిపక్షనేతగా పాదయాత్రలో ఇచ్చిన హామీనీ అమలుచేసి వారికి ఉద్యోగాలు కల్పించాలని ఏఐటీయూసీ ఉమ్మడి జిల్లాల ప్రధాన కార్యదర్శి,  ఆంధ్రప్రదేశ్ సాక్షర భారత్ విసిఓ ఎంప్లాయిస్ యూనియన్ విజయనగరం,పార్వతీపురం మన్యం జిల్లా గౌరవాధ్యక్షులు బుగత అశోక్ డిమాండ్ చేశారు.సోమవారం పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో సాక్షర భారత్ గ్రామ సమన్వయకర్తలతో కలిసి ర్యాలీగా విచ్చేసి కలెక్టరేట్ ఎదుట కొంతసేపు నినాదాలు చేసి నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరక్షరాస్యలైన వయోజనులని అక్షరాస్యలుగా చేయడానికి 2010లో కేంద్ర ప్రభుత్వం సాక్షర భారత్ కార్యక్రమాన్ని అన్ని రాష్ట్రాల్లోఏర్పాటు చేసింది. గ్రామ పంచాయతీకి ఇద్దరు విసిఓలను రెండు వేల రూపాయల గౌరవ వేతనంపై నియామకం చేశారు.గ్రామాల్లో 2010నుండి 2018వరకు సాక్షర భారత్ లో విశేష సేవలందించిన గ్రామసమన్వయకర్తలను అర్ధాంతరంగా 2018మార్చిలో గత ప్రభుత్వం తొలగించిందన్నారు.జగన్ పాదయాత్రలో పలుజిల్లాలో కలిసిన సాక్షర భారత్  వి.సి.ఓలకు న్యాయం చేస్తానని మాటఇచ్చి నేడుమరిచారని తెలిపారు. రాష్ట్రంలో 20వేలమంది విసిఓలు రోడ్డున పడ్డారన్నారు. గతంలో పనిచేసిన కాలంలో 9నెలల వేతనాలుకూడా వీరికి ఇవ్వలేదన్నారు. వీరంతా వయోజన విద్యావ్యాప్తికి వారధులని, సమాజ ప్రగతికి రధసారధులని, నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే సంధానకర్తలని,, చీకటిలో మగ్గుతున్న సమాజాన్ని వెలుగు వైపు పయనింపచేయలన్న బృహత్తర కార్యక్రమాన్ని భుజాన ఎత్తుకుని నేడు అంధకారంలో కూరుకుపోయి గత ప్రభుత్వ ఉత్తర్వుల వెన్నుపోటుతో ఉద్యోగాలు, ఉపాధికోల్పోయి అత్యంత దయనీయస్థితిలో కాలం గడుపుతున్నారని తెలిపారు.వీరికి న్యాయం చేసి తిరిగి ఉద్యోగాలు ఇచ్చేంత వరకు దశల వారీగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు.అనంతరం పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ కు వినతి పత్రాన్ని సమర్పించి తమ గోడును వివరించి న్యాయంచేయాలనికోరారు.ఈకార్యక్రమంకు సిపిఐ జిల్లా సహాయకార్యదర్శి జీవన్,కార్యవర్గ సభ్యులు జి.సూరయ్య, జిల్లా సమితి సభ్యులు ఎస్.దుర్గారావులు తదితరులుపాల్గొనిమద్దతుతెలిపారు.
ఈకార్యక్రమంలో యూనియన్ నాయకులు ఆర్. పాండురంగ నాయుడు, ఎమ్.ప్రకాష్, ఎన్. అప్పలనాయుడు, వి.వెంకటరమణ, ఎస్.సుధాకర్ రాజు, బి.గౌరీశంకర్, ఏ.నాగమణి, బి.అనురాధ, వై.లక్ష్మునాయుడు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img